సీఎం రమేష్ ,సుజనా చౌదరీల నెక్స్ట్ స్టెప్ ఏంటి.. !

సీఎం రమేష్ ,సుజనా చౌదరీల నెక్స్ట్ స్టెప్ | 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో కమలం గూటికి చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల పొలిటికల్ కెరీర్ దాదాపుగా మునిగిపోయిందనే విషయం స్పష్టమవుతోంది. పార్టీ మారి ఏళ్లు గడిచినా ఆ నలుగురిని బీజేపీ ఇంకా తమ మనుషులుగా గుర్తించడం లేదు. ప్రస్తుతం బిజెపిలో ఉన్నాకూడా ఇంకా టిడిపి కోవర్టులు అన్న ముద్ర వారి మీద వుంది. అందుకే బీజేపీ వారికి భవిష్యత్తులో నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

అదే సమయంలో బీజేపీ హార్డ్కోర్ జనాలకు మాత్రమే అవకాశం ఉందని.. వలస నాయకులకు అంత సీన్ లేదని కూడా అంటున్నారు. అప్పటికే గరికపాటి రామ్మోహన్ రావుకి అది అనుభవంలోకి వచ్చింది. రాజ్యసభ గడువు పూర్తయిన తర్వాత ఆయన పూర్తిగా సైలెంట్ అయ్యారు. సీఎం రమేష్,సుజనా చౌదరి,టీజీ వెంకటేష్ భవిష్యత్తు ఏంటో తేలాల్సి ఉంది.

ప్రస్తుతం ఈ జంపు జిలానీలు ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటికే పరోక్ష పదవులతో కాలం గడుపుతున్న వీరు.. ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగే అవకాశం లేదు. ఒకవేళ బీజేపీ పిలిచి టికెట్ ఇచ్చినా తప్పుకోవడం మినహా.. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి చేతులు కాల్చుకోవడం వీరికి అస్సలు ఇష్టం లేదు. అందుకే ఎంపీ పదవులు ఉన్నంత వరకు ఉండి, ఆ తర్వాత పొలిటికల్ కెరీర్ పై నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారట.

బిజెపి ఎలాగో వీరిని పక్కన పెడుతుంది కాబట్టి పరిస్థితులు అనుకూలిస్తే తిరిగి టీడీపీ గూటికి చేరుకోవాలనేది వీరి ఆలోచన. వైసీపీ వైపు వెళ్లాలని చూసినా జగన్ ఇలాంటి వారిని దగ్గరకు రానిచ్చే ప్రశ్నేలేదు. దీంతో మొత్తానికి చంద్రబాబు పైనే ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

More Latest telugu news todayOnline telugu news todayPolitical newsonline news today

Leave a Comment