ఏపీ ఫైబర్ నెట్ కేసులో తొలి అరెస్ట్

ఏపీ ఫైబర్ నెట్ కేసులో సాంబశివరావు అరెస్టయ్యారు. గత ప్రభుత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీగా ఆయన పనిచేశారు. ఇప్పటికే సాంబశివరావు, వేమూరి హరిప్రసాద్ లను cid విచారించింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం సాంబశివరావును cid అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. ( Fibernet : ఫైబర్ నెట్ స్కాం నిరూపించలేరని కాన్ఫిడెంట్ గా ఉన్న టీడీపీ )

Tera soft కంపెనీకి సాంబశివరావు నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టినట్టు cid గుర్తించింది. ఫైబర్ నెట్ లోని తోలి ఫేస్ లో 320 కోట్ల టెండర్లలో 120 కోట్ల అవినీతిని cid గుర్తించింది. ఇప్పటికే ఈ అక్రమాలపై 19 మందిపై cid కేసు నమోదు చేసింది. ఏ1 గా వేమూరి హరిప్రసాద్, ఏ2 గా సాంబశివరావు పై కేసు నమోదు చేసింది.

గత నాలుగైదు రోజులుగా వేమూరితో పాటు.. సాంబశివరావును కూడా cid పలుమార్లు విచారించింది. బ్లాక్ లిస్టులో ఉన్న Tera soft కి టెండర్లు దక్కేలా వేమూరి హరిప్రసాద్, మాజీ ఎండీ సాంబశివరావు చక్రం తిప్పారు. దీంతో ఫైబర్ నెట్ స్కాం లో తొలి అరెస్ట్ నమోదైనదని చెప్పవచ్చు. రాబోవు రోజుల్లో ఈ కేసులో మరికొన్ని అరెస్టులు జరగే అవకాశముందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

1 thought on “ఏపీ ఫైబర్ నెట్ కేసులో తొలి అరెస్ట్”

Leave a Comment