కరోనా లాక్ డౌన్ కారణంగా మూతపడిన సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కొద్దీ కొద్దిగా కోలుకుంటోంది. అప్పటికే బుల్లితెరకు సంభందించిన సీరియళ్ళు ప్రారంభమయ్యాయి. కొందరి అగ్రనాయకులు తమ జ్ఞాపకాలను, అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంటే, కొందరు యాడ్ ఫిలింస్ లో పాల్గొంటూ తమ అభిమానులను అలరిస్తున్నారు. ( బిగ్ బాస్ 4.. )
అందులో భాగంగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబుల ఫొటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. లాక్ డౌన్ నుండి అన్ లాక్ అయిన తర్వాత ఒక యాడ్ ఫిలిమ్ షూటింగ్ లో పాల్గొన్న మహేష్ బాబు తన న్యూ లుక్ తో అదరగొట్టాడు.
ఇక మెగాస్టార్ చిరంజీవి తాజాగా సోషల్ మీడియాలో విడుదల చేసిన న్యూ లుక్ ఫోటో చూసి అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. తనయుడు రాంచరణ్ కూడా ” నాన్నా నేను చూస్తున్నది నిజమేనా ” అంటూ సంబరానికి గురయ్యారు. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ తన భిమానులను అలరిస్తున్నారు మెగాస్టార్. ఒకేసారి కళ్ళజోడు తో, మరోసారి మీసాలు లేకుండా ఇలా అభిమానులను ఎంటర్ టైన్ చేస్తున్నారు.
” ఆచార్య ” సినిమాతో బిజీగా వున్న చిరు, మరికొంత మంది యువ దర్శకులతో సినిమాలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ లుక్ ఆచార్య సినిమాలోనిదే, బాస్ ఈస్ బ్యాక్ అంటూ తన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో తమ భావాలు తెలియజేస్తున్నారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …