కరోనా పుట్టింది మా దేశంలో కాదు : చైనా !

కరోనా పుట్టినిల్లు చైనా అని ప్రతి ఒక్కరికి తెలుసు. దీన్ని చైనా వైరస్ అని కూడా పిలుచుకుంటున్నాం. వుహాన్ ల్యాబ్ నుంచి ప్రపంచ దేశాలకు ఈ మహమ్మారి పాకింది అనడానికి సైంటిఫిక్ ఆధారాలు సైతం ఉన్నాయి. ఆ దేశ సైంటిస్టులే ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. కరోనా వైరస్ తమ దేశంలోనే పుట్టిందని చైనా సైతం ఒప్పుకుంది. కానీ ఇప్పుడు మాత్రం తనకు అలవాటైన రీతిలో నాలుక మడతేస్తోంది.

చైనా వితండ వాదన

కరోనా పాపం తన ఒక్కరిదే కాదని, వేరే దేశాలనుండి ఆ వైరస్ ఉద్భవించిందని కొత్త వాదన అందుకుంది. కరోనా వైరస్ తమ దేశం నుంచే వ్యాపించిందన్న అపవాదును తప్పించుకోడానికి చైనా సరికొత్త నాటకం మొదలు పెట్టింది. కరోనా వైరస్ చైనా పుట్టినిల్లు కాదు అనే వాదనను ముందుకు తెస్తోంది.

గత ఏడాది చాలా దేశాల్లో కరోనా వైరస్ పుట్టుకొచ్చిందని.. కానీ మొట్టమొదట గుర్తించి రిపోర్టు చేసిన దేశం తమదేనని.. వైరస్ కట్టడికి చర్యలు తీసుకున్న తొలి దేశం కూడా తమదేనని చెప్పుకొచ్చింది. అంతేకాదు వుహాన్ లోని బయోలాబ్స్ నుంచి కరోనా వైరస్ పుట్టుకొచ్చింది అనే వాదనను కొట్టి పారేసింది డ్రాగెన్. అలాగే అది వుహాన్ లోని సముద్రపు మార్కెట్లో లోని అలుగులు,గబ్బిలాల ద్వారా ఈ వైరస్ మనుషులకు సోకిందన్న వాదన కూడా తోసిపుచ్చింది.

ఈ అంశంపై మాట్లాడిన చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ” కరోనా వైరస్ అనేది ఒక కొత్త రకమైన వైరస్.. దీనికి సంబంధించి ఎన్నో నిజాలను రిపోర్టులు బయటపెట్టాయి.. ఈ వైరస్ గతేడాది పలు దేశాల్లో పుట్టుకొచ్చింది.. అయితే చైనా మాత్రమే దీనిపై మొదటి రిపోర్ట్ చేసింది.. వైరస్ జన్యు లక్షణాలను మిగతా ప్రపంచానికి తెలియజేసింది ” అని అన్నారు. ఇటీవల జపాన్లోని టోక్యో వేదికగా జరిగిన సమావేశంలో అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో కరోనా వ్యాప్తికి చైనానే కారణం అని ఆరోపించిన నేపథ్యంలో.. చైనా నుంచి ఈ ప్రకటన రావడం ఆసక్తికరంగా మారింది. చైనా నిజాలు దాచి పెట్టడం వల్లే ప్రపంచానికి ఈ దుస్థితి దాపురించిందని మైక్ పాంపియో ఆరోపించారు.

WHO బృందం పర్యటనతో..

నిజానికి చైనీస్ పౌరులు కరోనా వైరస్ గురించి మొదటి నుంచి కూడా గొంతెత్తుతున్నా అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం బలవంతంగా వాళ్ళ నోళ్లు మూయించిందన్నారు. ఇదిలా ఉంటే వైరస్ మూలాలను కనిపెట్టేందుకు సిద్ధమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందాన్ని చైనాకు పంపించే యోచనలో ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిపుణుల జాబితాను కూడా చైనాకు అందించింది. చైనా నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ బృందం అక్కడికి వెళ్లి వైరస్ పై పరిశోధనలు జరుపుతుంది. హాంగ్ కాంగ్ కి చెందిన South china morning post ఈ వివరాలు వెల్లడించింది.

ఇప్పటికే ఇద్దరు సభ్యులు WHO బృందం చైనా లో పర్యటించింది. ఆగస్టులో వుహాన్ లో పర్యటించిన ఈ బృందం వైరస్ మూలాలను కనిపెట్టేందుకు గ్రౌండ్ వర్క్ పూర్తి చేసింది. కరోనా వైరస్ విషయంలో చైనా వ్యవహారశైలి మొదటి నుంచి కూడా అనుమానాస్పదంగా ఉంది. ఇప్పటి వరకు సరైన లెక్కలు కూడా బయట పెట్టలేదు. చైనాలో కొన్ని కోట్ల మంది ఈ వైరస్ బారిన పడి ఉంటారని అంచనాలున్నాయి. అయినా ఇప్పటికీ కేసుల సంఖ్యను వేలల్లోనే చూపిస్తోంది. ఇప్పుడెమో కరోనా తమ దేశంలోనే పుట్టలేదనే వితండవాదం చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం చైనా పర్యటనకు సిద్ధమవుతున్న వేళ ఈ కొత్త నాటకానికి తెరతీసింది కుతంత్రాల డ్రాగన్.

Leave a Comment