టిడిపి మళ్లీ పుంజుకోవాలంటే బాబు మారాలి.. టీడీపీ విధానాలు మారాలి అంటూ లేటెస్టుగా టిడిపిలో చర్చలు మొదలయ్యాయి. టీడీపీ మీడియా కూడా ఇక బాబు తీరులో మార్పు రావాల్సిందే అని తేల్చి చెబుతోంది.
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తనకు నచ్చినట్టుగా పనిచేయడం.. ఓడిపోయిన తర్వాత తిరిగి గెలవడం కోసం కొన్ని తప్పులు జరిగాయి.. నిజమే.. ఇప్పుడు మారిపోయాను.. కాబట్టి మళ్లీ గెలిపించండి అని విజ్ఞప్తి చేయడం చాలా సాధారణ అలవాటుగా మారిపోయింది.
అప్పట్లో అలా..
2004 – 2009 ఎన్నికల్లో వరుసగా టిడిపి ఓడిపోయిన తర్వాత బాబు ఇప్పుడు మారిన మనిషి అంటూ తెలుగుదేశం పార్టీ.. ఆ పార్టీ మీడియా ప్రచారం చేసి 2014లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేగలిగారు. తిరిగి అధికారంలోకి వచ్చాక ఏం చేశారన్నది అందరికీ తెలిసిన విషయమే.
టిడిపి విధానాలు నిజంగా మారాలి అనుకుంటే జగన్మోహన్రెడ్డిని, కొందరు మంత్రులను పనిగట్టుకుని అసహనంతో ఏదోఒకటి మాట్లాడటం మానేయాలి. ఈ మధ్య కాలంలో మాటకు ముందు చంద్రబాబు, నారా లోకేష్ ఏం పీకుతారు అంటూ పరుషపదజాలం కూడా వాడుతున్నారు.
ఇలాంటి మాటలు తక్షణమే మానుకోవడం మంచిది. ఎందుకంటే ప్రతిపక్షం ప్రజల నుంచి సానుభూతిని సంపాదించాలి. అది జరగకపోగా అధికారం పోయిన తర్వాత కూడా అధికారం మీ అమ్మ మొగుడు సొత్తా.. చంద్రబాబు వెంట్రుక కూడా పీకలేరు వంటి పదాలు వాడటం వల్ల జనంలో టీడీపీ పెద్దలకు ఇంకా గర్వం తగ్గలేదు అన్న అభిప్రాయం స్థిరపడిపోయింది.
జగన్ ను తిట్టే క్రమంలో తన స్థాయికి వాడకూడని పదాలు కూడా వాడి తన వ్యక్తిత్వాన్ని కూడా తగ్గించుకుంటున్నారు చంద్రబాబు. ఈ విషయాన్ని టీడీపీ వారు కూడా గుర్తించాలి. నిజంగా అధికార పార్టీ అహంకారంతో వ్యవహరిస్తే వచ్చే ఎలక్షన్ లో ప్రజలే దింపేస్తారు. కానీ ఆల్రెడీ ఓడిపోయిన టీడీపీనే ఇంకా అహంకారాన్ని ప్రదర్శిస్తే ఆ పార్టీకే మరింత నష్టం.
చంద్రబాబు మరియు నారా లోకేష్ ముందుగా హైదరాబాదును వదిలేసి వారంలో కనీసం నాలుగు రోజులైనా ఆంధ్రలో ప్రజల మధ్య తిరిగితే ఫలితం ఉంటుంది. అలాకాకుండా జూమ్ ద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేస్తామంటే కుదరని పని. కేసులు పెడితే కోర్టుకు వెళ్లి వెంటనే స్టేలు తెచ్చుకోకుండా ఒకసారి చంద్రబాబు చట్టం ముందు ధైర్యంగా నిలబడాలి. సామాన్యులు కూడా చంద్రబాబు పై వ్యతిరేకత పెంచుకోవడానికి ఇది ఒక కారణంగా చెప్పవచ్చు.
సామాన్యుల విషయంలో తక్షణం స్పందించే చట్టాలు.. చంద్రబాబుకు మాత్రం వంత పాడుతున్నాయి అన్న భావన ప్రజల్లో ఉంది. టిడిపి కి అనుకూలంగా అని పేరున్న టీవీ చానెళ్లు ప్రతి దానికి నలుగురు ప్రభుత్వ వ్యతిరేకులను ముందేసుకుని రోజూ గంటలు గంటలు ప్రభుత్వంపై పనిగట్టుకుని బురదజల్లే కార్యక్రమం కూడా తగ్గిస్తే బాగుంటుంది. ఎందుకంటే తమ మీడియా ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నామని టీడీపీ అనుకుంటుంది కానీ పరోక్షంగా ప్రభుత్వానికి అది ఉపయోగపడుతూ వస్తుంది.
చంద్రబాబు అర్జెంటుగా చేయాల్సింది మాత్రం జగన్ రెడ్డి అనడం.. ఏమి పీకలేరు అనే డైలాగ్ లు మానుకోవాలి. అలా కాకుండా తాము అధికారంలో ఉన్నా లేకున్నా ఇలాగే వ్యవహరిస్తాము అంటే తిరిగి అధికారంలోకి రావడం మాత్రం కష్టమే.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …