జూనియర్ ఎన్టీఆర్ రావాలి అంటున్న పార్టీ సీనియర్లు : నారా లోకేష్ తనను తాను నిరూపించుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. అయితే ఆ పార్టీలోని నాయకులకు మాత్రం నారా లోకేష్ పై పూర్తిగా ఇంకా నమ్మకం కుదిరినట్టు కనపడటం లేదు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీని ఎదుర్కొనేందుకు చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే తనతో కలిసి వచ్చే శక్తులను, వ్యక్తులను దగ్గర చేసుకునే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు.
ఇటీవలే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా తాను కమ్మ వారికి అండగా ఉంటాను అని ప్రకటించడం ద్వారా పరోక్షంగా వచ్చే ఎన్నికల్లో తాను ఎటువైపు ఉంటాను అన్న దానిపైన పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. కేవలం పవన్ కళ్యాణ్ ను కలుపుకొని ఎన్నికలకు వెళ్లినంత మాత్రాన జగన్ ను ఓడించగలమన్న నమ్మకం అయితే ఆ పార్టీ సీనియర్ నేతలు వ్యక్తం చేయలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఒక పవన్ కళ్యాణ్ ని మాత్రమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ ని కూడా రంగంలోకి దింపాలని చంద్రబాబు నాయుడిపై సీనియర్లు ఒత్తిడి తెస్తున్నట్లు ప్రముఖ పత్రిక ఒక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే పార్టీ కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టాం.. వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీ అధికారంలోకి రాకపోతే చాలా కష్టమైపోతుంది.. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ని కూడా రంగంలోనికి దింపాలని చంద్రబాబును కోరినట్లు ఆ పత్రిక వెల్లడించింది. ( జగన్ మోహన్ రెడ్డి దూకుడు.. రంగంలోకి కేంద్రమంత్రి )
- జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోసం చంద్రబాబు ఆరాటం.. అది సాధ్యమవుతుందా.. ?
- అసెంబ్లీ రద్దు చేయాలంటున్న టీడీపీ.. మరి ముందస్తు ఎన్నికలకు రెడీనా..!
- వినాయకుడు | లోకరక్షకుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు
- నారా లోకేష్ పాదయాత్ర.. నాయకుడిగా సక్సెస్ అవుతాడా.. ?
- బీజేపీ సరికొత్త వ్యూహం.. బెంగాల్ విభజన రాగం..!
ఇలా సీనియర్ లు కోరిన తర్వాత చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ కు ఫోన్ చేసినట్టు కూడా తెలిసిందని తనకున్న సమాచారం ఆధారంగా ఆ పత్రిక వెల్లడించింది. చంద్రబాబు ఫోన్ కాల్ కు జూనియర్ ఎన్టీఆర్ నుంచి కూడా సానుకూల స్పందన వచ్చిందని.. కానీ అదే సమయంలో పార్టీలో కొన్ని కీలకమైన మార్పులు చేయాల్సిందిగా జూనియర్ ఎన్టీఆర్ ప్రతిపాదించారని కూడా ఆ పత్రిక చెబుతోంది. నారా లోకేష్ పెత్తనం పార్టీలో ఎక్కువైపోయింది.. ఈ అంశం చాలామంది నాయకులకు నచ్చడం లేదు.. కాబట్టి లోకేష్ ను నియంత్రించండి అని చంద్రబాబు నాయుడుకు జూనియర్ ఎన్టీఆర్ సూచించినట్లు తెలుస్తోంది అను కూడా ఆ పత్రిక వెల్లడించింది. ( చంద్రబాబు ఆడిన గేమ్ )
జూనియర్ ఎన్టీఆర్ కోసమే లోకేష్ ను పక్కనపెడుతున్నారా
జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఇలాంటి ప్రతిపాదనలు వచ్చిన తరువాతనే నారా లోకేష్ ను కేవలం పరామర్శలకు మాత్రమే చంద్రబాబు పరిమితం చేయాలని నిర్ణయించారు అని కూడా ఆ పత్రిక చెబుతోంది. ఈ పరిణామం తర్వాతనే నారా లోకేష్ అలక బూనినట్లు తెలుస్తోంది అని కూడా ఆ పత్రిక వెల్లడించింది. జూనియర్ ఎన్టీఆర్ మాటలు విని తనను పక్కన పెట్టడం పై కలత చెందినట్టు తన సన్నిహితుల వద్ద నారా లోకేష్ వాపోయారు అని కూడా ఆ పత్రిక తనకున్న సమాచారం ఆధారంగా ఒక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది.
- మా బాబుగారు సింహంలా ఢిల్లీ వస్తే ఎవరూ పట్టించుకోరే.. !
- పాకిస్తాన్ లో తాలిబన్ జెండాలు.. ఉలిక్కిపడ్డ ఇమ్రాన్ ఖాన్
- పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ రాజీనామా..!
- చైనా గుప్పెట్లోకి శ్రీలంక దీవులు..భారత్ కు ముప్పు పొంచిఉందా ..?
- IT Rides on Sonu sood | సోనూసూద్ ఇంటిపై ఇన్కమ్ టాక్స్ దాడులు.. అందుకేనా.. !
మొత్తం మీద 2024 ఎన్నికల్లో తాను, తన కుమారుడు మాత్రమే జగన్ మోహన్ రెడ్డిని ఓడించడం సాధ్యం కాదు అన్న నిర్ణయానికి చంద్రబాబు నాయుడు వచ్చినట్టుగానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా తనతో కలిసి వచ్చేందుకు దాదాపు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా.. కేవలం పవన్ కళ్యాణ్ ని కలుపుకొని వెళ్లడం వాళ్ళ ఫలితం అనుకూలంగా ఉంటుంది అన్న ధీమా అయితే చంద్రబాబు నాయుడుకు గానీ.. ఆ పార్టీ నాయకులకు కూడా కనిపించడం లేదు అన్నది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని కూడా కలుపుకుపోవాలని దాదాపు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ( నారా లోకేష్ వ్యవహార శైలే టీడీపీ ఈ పరిస్థితికి కారణమా.? )
అయితే 2009 ఎన్నికల్లో కూడా ఇలాగే జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి ప్రచారం చేసుకుని వాడుకున్నారు. కానీ ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏమాత్రం పట్టించుకోకపోగా.. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణను కూడా పొమ్మనకుండా పొగ పెట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశారు.
ఇక 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ కు లైన్ క్లియర్ గా ఉండాలనే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ ను మరింత దూరం చేస్తూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు అవసరం పడింది కాబట్టి తిరిగి జూనియర్ ఎన్టీఆర్ ను దువ్వే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నట్లు అర్థమవుతోంది. కాకపోతే ఇదివరకే ఒకసారి ప్రచారం చేసి దెబ్బతిన్న జూనియర్ ఎన్టీఆర్ ఈసారి మాత్రం ఎలాంటి ముందస్తు కానీ.. ఎలాంటి ప్రతిపాదనలు గాని లేకుండా చంద్రబాబు నాయుడు కోసం టీడీపీ తరపున ప్రచారం చేస్తారా అన్నది చూడాలి.
3 thoughts on “జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోసం చంద్రబాబు ఆరాటం.. అది సాధ్యమవుతుందా.. ?”