తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కరకట్ట ఇంటిని ఖాళీ చేయారా.. ఎన్నాళ్ళు ఇలా ఉంటారు. అధికార పార్టీతో మాటలు పడుతూ ఉంటారు. ఇటీవల వచ్చిన వరదలకు మళ్లీ కృష్ణా నీరు చంద్రబాబు ఇంటికి చేరింది. అధికారులు సైతం మరోసారి చంద్రబాబు ఇంటికి నోటీసులు అంటించారు.
ఇలా ఎంతకాలం కరకట్టను పట్టుకొని వేలాడుతారు అన్న ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతాయి. అందరితో అనిపించుకుంటూ ఎన్నాళ్ళిలా నెట్టుకొస్తారు అన్నది తెలియడం లేదు. నిజానికి కరకట్ట మీద నివాసం చంద్రబాబు సొంత ఇల్లు కాదు. ఆయన అద్దె ఇంట్లో ఉంటున్నాడు.
గత ఏడాది కూడా వరద సమయంలో చంద్రబాబు నివాసంలోకి వరద నీరు ప్రవేశించింది. అప్పుడు కూడా అధికారులు నోటీసులు జారీ చేశారు. మంత్రులు కూడా చంద్రబాబు నివాసాన్ని పరిశీలించి వచ్చారు. గత ఏడాది అయితే వరద నీటిని కావాలని చంద్రబాబు నివాసానికి మళ్లించారని టిడిపి నేతలు వైసీపీ పై విమర్శలు చేశారు. ఈ ఏడాది కూడా వరద వచ్చింది. మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది.
చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఆయన ప్రత్యేకంగా తన కోసం గదులను కూడా నిర్మించుకున్నారు. కృష్ణానది బ్యాక్ వాటర్ సమీపంలోనే చంద్రబాబు నివాసం ఉంటుంది. వరద వచ్చిన ప్రతీ సారి ఈ సమస్య చంద్రబాబు తప్పదు. ప్రతిసారి అధికారుల నుంచి నోటీసులు అందుకోవడం కూడా చంద్రబాబు లాంటి సీనియర్ నేతకు తగదు.
విజయవాడలో మరో నివాసాన్ని చూసుకుంటే మంచిదని టిడిపి నేతలు సైతం చంద్రబాబుకు సూచిస్తున్నారు. చంద్రబాబు ఆలోచన మాత్రం మరోలా ఉంది. ప్రభుత్వం తనను ఖాళీ చేయిస్తే సానుభూతి పెరుగుతుందని ఆయన ఖాళీ చేయకుండా ఉన్నారు అని కూడా చెబుతున్నారు.
చంద్రబాబు నివాసాన్ని ఖాళీ చేయిస్తామని వైసీపీ నేతలు అసెంబ్లీ లోనే చెప్పడంతో.. బలవంతంగా ఖాళీ చేయిస్తేనే తనకు రాజకీయంగా ఉపయోగం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు తన నివాసాన్ని వరద వచ్చిన ప్రతిసారీ ఇలానే హాట్ టాపిక్ గా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …