చంద్రబాబు తన గురించి, టీడీపీ గురించి ఆలోచించడం మాని జగన్ గురించి కలవరపడుతున్నట్టు కనిపిస్తోంది. బహుశా మునుపెన్నడూ లేని విధంగా టిడిపిని అధఃపాతాళానికి తొక్కేసిన జగన్ ని మర్చిపోవడం ఇప్పట్లో సాధ్యం అయ్యేది కూడా కాకపోవచ్చు. కానీ మనసును అదుపులో పెట్టుకోవాలి. చంద్రబాబుకు అది సాధ్యం కావడంలేదని ఆయన నడవడిక చూస్తేనే అర్థమైపోతుంది.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పగటి కలలు కంటున్నారు. తన ప్రత్యర్థి ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు 10 నుంచి 30 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఢిల్లీ సంస్థ తన నివేదికలో పేర్కొన్నట్లు చంద్రబాబు గుర్తు చేశారు.
గుంటూరు లోక్ సభ నియోజకవర్గం నేతలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఈ మాటలు అన్నారు. సదరు ADR సంస్థ జగన్ కేసును విచారించే న్యాయవ్యవస్థ కాదు. తన ప్రత్యర్థి గురించి ఎవరో ఏదో చెబితే అందులో సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకోకుండా చంద్రబాబు ఎందుకు అంత ఆనందపడి పోతున్నారో అర్థం కావడం లేదు.
జగన్ కైనా చంద్రబాబుకైనా శాశ్వతంగా శిక్ష విధించే అధికారం యొక్క ప్రజాకోర్టుకు మాత్రమే ఉంటుంది. ప్రజా కోర్టు తలచుకుంటే రాజకీయ భవిష్యత్తు లేకుండా ఇంటికే పరిమితం చేసి కాళ్ళు చేతులు కట్టేయ గలదు. ఇప్పుడు చంద్రబాబు ఆ శిక్షలోనే ఉన్నారు. కానీ ఆ విషయాన్ని ఆయన జీర్ణించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.
తాజాగా గుంటూరు లోక్సభ నియోజకవర్గం నేతలతో మాట్లాడుతూ జగన్ కు 10 నుంచి 30 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఏదో సంస్థ చెప్పిన విషయాన్ని ప్రస్తావించడంలో బాబు ఉద్దేశం ఏమిటి. దీని వల్ల పార్టీకి ప్రయోజనం ఏంటి. ఈ సందర్భంగా బాబు ఎంత ఒత్తిడిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
అధికారాన్ని కోల్పోయి హైదరాబాదులో ఇంటికే పరిమితమైన బాబు తనకు తాను గృహనిర్బంధం విధించుకున్నట్టు కాదా. భవిష్యత్తులో అయినా టిడిపి అధికారంలోకి వస్తుందన్న భరోసా ఉందా.. అందుకు తగ్గ కార్యాచరణ క్షేత్రస్థాయిలో జరుగుతున్నట్టు ఎక్కడా కనిపించట్లేదు. తాను 30 ఏళ్లు అధికారంలో ఉండే ఆలోచనతో జగన్ సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నారు.
2024 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వస్తే మాత్రం టిడిపి కథ కంచికి చంద్రబాబు ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. కావున చంద్రబాబు పదేపదే జగన్ గురించి ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోకుండా సొంత పార్టీ భవిష్యత్తు కూడా పాడు చేసుకోకుండా ఉంటే మంచిది.
జగన్ జైలుకు వెళితే వేరొకరు పగ్గాలు చేపడతారు. అందువల్ల వాళ్లకు లేని దిగులు చంద్రబాబు ఎందుకు. ఇప్పటికైనా చంద్రబాబు పగటి కలలు మాని వాస్తవంలోకి రావాలి. తన పార్టీ అధికారంలోకి రావాలని కలలు కనడంతో పాటు వాటిని సాకారం చేసుకునే ప్రయత్నం చేస్తే ఏదైనా ప్రయోజనం ఉండొచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు.