ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి.. చంద్రబాబు డిమాండ్.. నిజంగా అంత సీన్ వుందా.. !

ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి.. చంద్రబాబు : ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేని రాష్ట్రంలో ఏదో ఒక నెపంతో రాష్ట్రపతి పాలన పెట్టి, ఆ తర్వాత అక్కడ బీజేపీ ప్రభుత్వంను నిలబెట్టడం ఆ పార్టీకి అలవాటు. అసలు ఏపీలో ఆ పరిస్థితి ఉందా..? అసలు కేంద్రానికి అంత సీన్ ఉందా..? మరి చంద్రబాబు ఎందుకు ఎగిరెగిరి పడుతున్నారు. కేంద్రానికి లేఖలు రాస్తున్నారు.

గతంలో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని.. ఏపీలో రాష్ట్రపతి పాలన పెడతారని తెగ ప్రచారం చేశారు. తాజాగా ఇప్పుడు శాంతిభద్రతల సమస్య ఉందని.. ఏపీలో రాష్ట్రపతి పాలన తప్పదని టీడీపీ ప్రచారం చేసుకుంటోంది. ( అసెంబ్లీ రద్దు చేయాలంటున్న టీడీపీ )

ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టే పరిస్థితులు ఉన్నాయా..

రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టే అధికారం కేంద్రానికి ఉంటుంది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం గందరగోళ వాతావరణంను నియంత్రించే పరిస్థితి లేనప్పుడు గవర్నర్ సూచనల మేరకు రాష్ట్రపతి పాలన విధించచ్చు. లేదా ఎమ్మెల్యేల తిరుగుబాటు, రాజకీయ సంక్షోభం ఏర్పడితే రాష్ట్రపతి పాలన పెట్టి తిరిగి ఎన్నికలకు సిఫార్సు చేయొచ్చు. కానీ ఏపీలో రాష్ట్రపతి పాలనకు అలాంటి ఇలాంటి పరిస్థితులు లేవు. 151 మంది ఎమ్మెల్యేలతో వైసీపీ బలంగా ఉంది. ఇంకొంత మంది అదనంగా కూడా ఉన్నారు.

ఇక శాంతిభద్రతల విషయానికొస్తే మంగళగిరిలో పగిలిన అద్దాలను చూపించి టిడిపి హడావిడి చేస్తోంది. కానీ ఎక్కడ సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది లేదు. అసలు ఏపీ బంద్ అంటూ టీడీపీ ప్రకటించిన రోజే ప్రజా జీవనం సాఫీగా సాగింది. మరి అలాంటప్పుడు రాష్ట్రపతి పాలన ఎందుకు వస్తుంది.

కేంద్రం జోక్యం చేసుకుంటుందా

ఏ రాష్ట్రంలోనైనా ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. కానీ ఏపీలో ఇబ్బంది ప్రజలకు కాదు.. కేవలం టీడీపీ నేతలకు మాత్రమే. టిడిపి నేతలు వరుస ఓటములతో కుంగిపోయారు. పార్టీ పరిస్థితి మెరుగుపడే పరిస్థితి కనపడటం లేదు. వచ్చే ఎన్నికల్లో మరింత పతనం ఖాయం అనే విషయాన్ని జీర్ణించుకోలేక అవస్థలు పడుతున్నారు.

నిన్న ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లు వైసీపీపై ప్రజల అభిమానాన్ని జీర్ణించుకోలేక టిడిపి ఇలా అవస్థలు పడుతోంది. ఏపీలో ఏదో జరిగిపోతుందని కలరింగ్ ఇచ్చి కేంద్రానికి లేఖలు రాసి రాక్షస ఆనందాన్ని పొందుతోంది. చంద్రబాబు లేఖలను పట్టించుకునే స్థితిలో కేంద్రం లేదు. అయినా ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టే అవసరమూ లేదు. కేవలం బాబు లేఖలను బూచిగా చూపి ప్రజలను తప్పుదోవ పట్టించే పచ్చమీడియాకు మాత్రమే ఆ రాష్ట్రపతి పాలననే ఓ ముఖ్యమైన అంశంగా కనబడుతుంది.

2 thoughts on “ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి.. చంద్రబాబు డిమాండ్.. నిజంగా అంత సీన్ వుందా.. !”

Leave a Comment