టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఢిల్లీలో చేదు అనుభవం ఎదురైంది. సింహంలా ఢిల్లీలో దిగారు.. ఉగ్రసింహంలా రాష్ట్రపతి భవన్ లోకి అడుగుపెట్టారు అంటూ టీడీపీ అనుకూల మీడియా ఎన్ని జాకీలు పెట్టి లేపినా ప్రయోజనం లేకుండాపోయింది. ఈసారి జాతీయ మీడియా విషయంలోనూ చంద్రబాబు విఫలమయ్యారు.
చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు.. ఇక ఏపీలో రాష్ట్రపతి పాలనే అంటూ రెండు రోజులుగా తెలుగు టీడీపీ మీడియా ఊదరగొట్టింది. రాష్ట్రపతితో పాటు మోడీ, అమిత్ షాలను కలుస్తారని.. ఇక జగన్ సర్దుకోవాల్సిందే అంటూ కథనాలు రాశాయి. తీరా చూస్తే చంద్రబాబు పర్యటన అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ( గంజాయి సరఫరా చేసిన క్రెడిట్ మాదే.. గంటా శ్రీనివాస్ )
ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కాశ్మీర్ పర్యటన ముగించుకొని వచ్చినప్పటికీ అమిత్ షా కూడా చంద్రబాబును దగ్గరకు రానివ్వలేదు. మరికొందరు కేంద్ర పెద్దలను చంద్రబాబు కలుస్తారంటూ టీడీపీ మీడియా చెబుతూ వచ్చింది. కానీ ఒక్క రాష్ట్రపతి తప్ప మరెవరూ బాబుకు దర్శనం ఇవ్వలేదు. దాంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగించుకొని ఉసూరుమంటూ హైదరాబాద్ బయలుదేరారు.
- మా బాబుగారు సింహంలా ఢిల్లీ వస్తే ఎవరూ పట్టించుకోరే.. !
- పాకిస్తాన్ లో తాలిబన్ జెండాలు.. ఉలిక్కిపడ్డ ఇమ్రాన్ ఖాన్
- పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ రాజీనామా..!
- చైనా గుప్పెట్లోకి శ్రీలంక దీవులు..భారత్ కు ముప్పు పొంచిఉందా ..?
- IT Rides on Sonu sood | సోనూసూద్ ఇంటిపై ఇన్కమ్ టాక్స్ దాడులు.. అందుకేనా.. !
సిల్లీ కారణాలతో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ చంద్రబాబు ఢిల్లీ రావడాన్ని అందరూ గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా జాతీయ మీడియాను మేనేజ్ చేసేవారు. ఈసారి జాతీయ మీడియా కూడా చంద్రబాబు దగ్గరకు వచ్చేందుకు సాహసించలేదు. చంద్రబాబు పర్యటనకు ఏ మాత్రం ప్రాధాన్యం లభించక పోవడం.. మీడియాలో కూడా కవరేజ్ లేకపోవడంతో కంగారుపడిన టిడిపి నేతలు.. పదే పదే జాతీయ మీడియా జర్నలిస్టులకు ఫోన్లు చేసి ఆహ్వానించారు. ఏపీకి సంబంధించి, జాతీయ రాజకీయాల గురించి చంద్రబాబు కీలక ప్రకటన చేస్తారని ఆశపెట్టినా చంద్రబాబును జాతీయ మీడియా ఏమాత్రం పట్టించుకోలేదు. ( తెలుగుదేశం పార్టీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైర్..! )
చంద్రబాబు తనకు తాను గొప్ప లీడర్గా భావిస్తున్నారే గాని.. ఢిల్లీలో ఆయనకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులు గానీ.. పార్టీలు గానీ ఇప్పుడు లేవు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడ టీడీపీ మీడియా చంద్రబాబును ఒక సింహం అంటూ పొగిడింది గానీ.. ఢిల్లీలో మాత్రం ఖాళీగా ఉన్న వృద్ధ నేతలు కూడా చంద్రబాబును పలకరించిన పాపాన పోలేదు.
చంద్రబాబు పదేపదే పొత్తులు మార్చి అన్ని పార్టీలను మోసం చేయడం.. అమిత్ షా పై రాళ్లు రువ్వడం.. కేవలం ముగ్గురు లోక్సభ.. ఒక రాజ్యసభ ఎంపీ తప్ప మరేమీ లేని పార్టీ కావడంతో చంద్రబాబును ఎవరూ పరిగణనలోనికి తీసుకోలేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు పర్యటన అట్టర్ ప్లాప్ అవడంతో పార్టీ పరువు పూర్తిగా దెబ్బతింది అన్న భావన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది.
అసలు మోడీ, అమిత్ షాలను కలుస్తారంటూ ముందే టిడిపి ఛానల్లో డబ్బాకొట్టారని.. దాంతో ఇప్పుడు వారిని కలిసే అవకాశం రాకపోవడంతో ప్రజల్లో మరింత చులకన అయిపోయామని వాపోతున్నారు. సింహం, ఉగ్రరూపమంటూ లేని పోనీ ఎలివేషన్స్ ఇచ్చి ఇప్పుడు చంద్రబాబుకు ఉన్న పరువు కూడా టీడీపీ మీడియా నాశనం చేసిందని టీడీపీ నేతలు వాపోతున్నారు.
1 thought on “మా బాబుగారు సింహంలా ఢిల్లీ వస్తే ఎవరూ పట్టించుకోరే.. !”