సోనూసూద్ తో పోటీ పడనున్న చంద్రబాబు.. !

చంద్రబాబు రాజకీయ ఎత్తుగడలు చాలా భిన్నంగా ఉంటాయి. చంద్రబాబు ప్రజలకు నేరుగా దగ్గరవడం కంటే పరోక్ష పద్ధతిలో ప్రజలను తన వైపు తిప్పుకునేలా ఎత్తుగడలు వేస్తూ ఉంటారు.

సమాజంలో పేరు గల వారికి దగ్గరవడం ద్వారా.. వారిని అభిమానించే వారిలో తన పట్ల సానుకూలత పెంచుకోవడం అన్నది చంద్రబాబుకు ఉన్న గొప్ప అలవాటు. అందుకే చంద్రబాబు హయాంలో వ్యక్తులు బాగుపడతారే కానీ ప్రజలకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు అన్న అభిప్రాయం ఉంది.

చంద్రబాబు ఈ తరహా రాజకీయ ఎత్తుగడలు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలం నుండి నడుస్తున్నవే. అందుకే ఇప్పుడు పక్క రాష్ట్రాల వారిని రంగంలోకి దింపటం మొదలుపెట్టారు.

కొద్ది రోజుల క్రితమే మహారాష్ట్రలోని అమరావతిలో ఎంపీగా గెలిచిన నవనీత్ కౌర్ ను టిడిపి మీడియా చర్చ కార్యక్రమాలకు పిలిచింది. ఆమె ఎస్టీ కాదని ఇటీవలే బాంబే హైకోర్టు తేల్చి చెప్పడంతో ఆ సందర్భంగా చర్చకు పిలిచారు. ఏపీలోని అమరావతికి మద్దతు ఇచ్చేలా ఆమెతో చర్చా కార్యక్రమంలో మాట్లాడించారు.

తాజాగా దాన ధర్మాలతో పేరొందిన ప్రముఖ నటుడు సోనూసూద్ ను ఎన్టీఆర్ ట్రస్ట్ శనివారం నిర్వహించిన వెబ్ నార్ లోకి ఆహ్వానించారు. చంద్రబాబు కూడా దీంట్లో హాజరయ్యారు. కరోనా సేవలపై చర్చ అయినప్పటికీ.. హైదరాబాద్ ను అభివృద్ధి బాట పట్టించింది చంద్రబాబే అని తాను తెలుసుకున్నట్టు సోనూసూద్ చెప్పారు. ( విశాఖకు రాజధాని తరలింపుకు )

కరోనాపై వెబ్ నార్ చర్చ అయినప్పటికీ టీడీపీ అనుకూల మీడియా సంస్థలు ఆ విషయాన్ని పక్కన పెట్టి, చంద్రబాబును సోనూసూద్ కీర్తించిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించాయి. బహుశా చిత్రపరిశ్రమలో ఎక్కువమంది టీడీపీ అనుకూలురే కాబట్టి.. సోనూసూద్ కు తమ చంద్రబాబు వల్లే హైదరాబాద్ ఇలా ఉంది అని చెప్పి ఉండవచ్చు.

కాకపోతే చంద్రబాబు కృషి ఏపాటిదో ప్రజలకు అందరికీ తెలుసు కనుక గ్రేటర్ పరిధిలోని ఒక్క అసెంబ్లీ స్థానంలో కానీ.. చివరకు జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఒక కార్పొరేటర్ ను కూడా టిడిపి తరఫున గెలిపించ లేదు. ఇక్కడ సోనూసూద్ ని తప్పుపట్టాల్సిన పని లేదు. ఎందుకంటె చంద్రబాబు హైటెక్ సిటీ ఫార్ములాపై ఒక విదేశీ మహిళా స్కాలర్ చేసిన పరిశోధనకు సంబంధించిన వీడియోలు సోనూసూద్ చూసి ఉండకపోవచ్చు.

అసలు కరోనా సమయంలో చంద్రబాబు చేసిన సేవ ఏంటోగానీ.. సోనూసూద్ తో కలిసి పనిచేద్దామని ఆహ్వానించడం ద్వారా ఇకపై సోనూసూద్ పడే శ్రమలో చంద్రబాబు క్రెడిట్ కొట్టేస్తారు. కరోనా సమయంలో సోనుసూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలు దేశంలోని ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచాయి. ఇలాంటి మంచి వారు రాజకీయ పార్టీలకు వీలైనంత దూరంగా ఉంటే మరీ మంచిదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

1 thought on “సోనూసూద్ తో పోటీ పడనున్న చంద్రబాబు.. !”

Leave a Comment