కరోనాతో కేంద్ర మంత్రి కన్నుమూత..

కేంద్ర మంత్రి సురేష్ అంగాడి కరోనా కారణంగా కన్నుమూసారు. రెండు వారాల క్రితమే తనకి కరోనా పాజిటివ్ వచ్చినట్టు ప్రకటన విడుదల చేయగా, అది తగ్గక పోవడంతో ఢిల్లీ ఎయిమ్స్ లో ఈ రోజు తుడు శ్వస విడిచారు.

కర్ణాటకలోని బెళగావి లోక్ సభనుంచి ఎంపిగా విజయం సాధించారు. ఏకంగా నాలుగు సార్లు ఎంపిగా గెలిచినా సురేష్ అంగాడి ప్రస్తుతం రైల్వే శాఖ సహాయ మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన మృతికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.

Leave a Comment