సినిమా థియేటర్స్ రీ ఓపెన్ ..! October-1..

పశ్చిమ బెంగాల్‌లో సినిమా హాల్స్, ఓపెన్ ఎయిర్ థియేటర్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 1 ( October-1st ) నుంచి సినిమా థియేటర్స్ తో పాటు డ్యాన్సింగ్ ఈవెంట్స్, మ్యూజిక్ షోలకు అనుమతినిస్తామంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జి (CM Mamata Banerjee) ప్రకటించారు. కరోనావైరస్ కారణంగా మార్చి నుంచి లాక్ డౌన్ మొదలుతో సినిమా ధియేటర్స్ అన్నీ మూత పడ్డాయి. ( నగరానికి మరో మణిహారం)

ఆర్ధికంగా ఏంతో నష్టపోతున్నామని, తమని ఎలాగైనా ఆదుకోవాలని సినీ పరిశ్రమ నుంచి వినతులు వచ్చిన కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే థియేటర్లకైనా మరి ఏ ఇతర కార్యక్రమంలోనైనా 50 మందికి మించి అనుమతించేది లేదని స్పష్టంచేశారు. భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి అన్ని కొవిడ్-19 నిబంధనలను తప్పక పాటించాల్సి ఉంటుందని ట్విటర్ ద్వారా దీదీ ఈ వివరాలు వెల్లడించారు.


పశ్చిమ బెంగాల్‌లో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందా లేక సినీ పరిశ్రమ ఒత్తిడితోనే ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియాల్సివుంది. దీంతో మిగతా రాష్ట్రాల్లో కూడా సినిమా థియేటర్స్ రీ ఓపెన్ ఆలోచనలు చేసే అవకాశం లేకపోలేదు.

Leave a Comment