బస్సులోనే సజీవ దహనం..

Bus fires

బస్సులోనే ఐదుగురు సజీవదహనమైన దారుణ ఘటన కర్ణాటక లోని చిత్రదుర్గ జిల్లాలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ ఉదయం ఓ ప్రైవేటు బస్సు 32 మంది ప్రయాణికులతో విజయపుర నుంచి బెంగళూరు వెళ్తుండగా.. కేఆర్ హళ్లికి చేరుకోగానే ఒక్కసారిగా బస్సులో మంటలు వ్యాపించాయి.

మంటల్లో బయటకు వెళ్లలేని ఐదుగురు ప్రయాణికులు బస్సులోనే సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Leave a Comment