బీఎండబ్ల్యూ నుంచి మరో కొత్త బైక్ లాంచ్ అయింది. BMW R18 పేరిట కొత్త క్రూయిజర్ బైక్ ను భారత్ లో విడుదల చేశారు. జర్మనీకి చెందిన దిగ్గజ సంస్థ అయిన బీఎండబ్ల్యూ ఖరీదైన కార్లు మరియు బైకులకు ప్రసిద్ధి.
ఈ సారి రెండు వేరియంట్లలో ఈ బైక్ ను లాంచ్ చేశారు. ధర 18.9 లక్షలు కలిగిన స్టాండర్డ్ మోడల్ గా ఒకటి , ధర 21.9 లక్షలు కలిగిన ఫస్ట్ ఎడిషన్ మోడల్ ఒకటి. మార్కెట్ లోకి వచ్చేసరికి అన్ని టాక్సులు కలిపి ధర కొంచెం ఎక్కువగా ఉండొచ్చు.
BMW R18 క్రూయిజర్ బైక్ 1802 సిసి ఎయిర్ కూల్డ్ , 6 గేర్ల సామర్ధ్యంతో వస్తోంది. దీని బైక్ ఇంజన్ 4780 rpm వద్ద 89.75 bhp ని అలాగే 3000 rpm వద్ద 158 ఎన్ ఎమ్ టార్క్ ను విడుదల చేస్తుంది. ఇందులో స్విచబుల్ ఆటోమేటిక్ కంట్రోల్ , ఎల్ఇడి లైట్, అనలాగ్ ఇంస్ట్రుమెంట్ కంట్రోల్ వున్నాయి. బైక్ లో రివర్స్ గేర్ ఒక ప్రత్యేకతగా నిలిచింది. ఇంకా ముందు చక్రానికి డబుల్ డిస్క్ , వెనక చక్రానికి సింగల్ డిస్క్ బ్రేక్ సిస్టం అమర్చారు.
ఇవాల్టి నుంచే బుకింగ్స్ ప్రారంభమయ్యాయని, బుకింగ్ కొరకు డీలర్ ని సంప్రదించవచ్చని బీఎండబ్ల్యూ ప్రతినిధులు పేర్కొన్నారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …