VPN లను బ్యాన్ చేయాలంటూ కేంద్రానికి స్టాండింగ్ కమిటీ సిఫార్సు

VPN లను బ్యాన్ చేయాలని హోంశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ VPN సర్వీసుల వల్ల చాలామంది సైబర్ నేరగాళ్లు అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. ఐటీ శాఖ మరియు ఎలక్ట్రానిక్స్ విభాగాల సహకారంతో హోంశాఖ ఈ VPN లను గుర్తించి వాటికి అడ్డుకట్ట వేయాలని ఈ కమిటీ కోరింది. అందుకు అంతర్జాతీయ ఏజెన్సీల సహకారం కూడా అవసరముందని వెల్లడించింది.

ఈ కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి దేశం మొత్తంగా ఐటీ పరిశ్రమలు వర్క్ ఫ్రమ్ హోం విధానంలో పనిచేస్తున్నాయి. అందుకోసం పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు వీపీఎన్ లను వినియోగిస్తున్నాయి. దీనికి ప్రభుత్వం నుంచి కూడా అనుమతి వచ్చింది. వీరి పనికి అనుకులంగా డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ విధించిన రూల్స్ ను కూడా సడలించింది. ఇప్పుడు అవే వీపీఎన్ సర్వీస్ లను బ్యాన్ చేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది. ( Integrated Battle Groups )

అసలు VPN అంటే?

VPN అంటే Virtual Private Network .ఇది ఇంటర్నెట్​కు మరియు యూజర్లకు మధ్య సురక్షితమైన కనెక్షన్ ను రూపొందిస్తుంది. వీపీఎన్​ ద్వారా మనం స్టాటిక్ ఐపీ నెట్​వర్క్​కు కనెక్ట్ అవుతాం. వీపీఎన్ నెట్​వర్క్ మన బ్రాడ్​బ్యాండ్​లోని ఇంటర్నెట్ యాక్టివిటీని​ పూర్తిగా అడ్డుకుంటుంది. ఇతర పబ్లిక్ సైట్లు, మన నెట్​వర్క్​ల బ్రౌజింగ్ యాక్టివిటీని చూడకుండా చేస్తుంది. వర్క్ ఫ్రమ్ హోంలో భాగంగా రిమోట్ యాక్సిస్ కోసం వీపీఎన్​ను పలు సంస్థలు ఉపయోగిస్తుంటాయి. ఒకసారి vpn ద్వారా కనెక్ట్ అయితే వారి లోకల్ సర్వర్ ఫైల్స్ ని, సమాచారాన్ని ఎక్కడి నుండి అయినా యాక్సెస్ చేసే వీలు కలుగుతుంది. ( Youtube deleted 10lack videos )

వీపీఎన్ నెట్​వర్క్​ వినియోగించే వారికి వారి సిస్టంని ఎవరూ ట్రాక్ చేస్తారన్న భయం ఉండదు. వీపీఎన్ తో ప్రైవేట్ సర్వర్లకు కనెక్ట్ ద్వారా యూజర్ల ఐపీ అడ్రెస్ ఇతర సర్వీస్ నెట్​వర్క్​లకు కనిపించదు. అందువల్ల ఏ నెట్​వర్క్ వీటిని గుర్తించలేవు. దీంతో సైబర్ నేరగాళ్లు మరింతగా రెచ్చిపోయే అవకాశం ఉందని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఇది దేశ భద్రతకు ముప్పు కలిగించే ప్రమాదం ఉందని పేర్కొంది. జాతీయ భద్రతా దృష్ట్యా ఇప్పటికే భారత ప్రభుత్వం చైనాకు చెందిన పలు యాప్ లను బ్యాన్ చేసింది. మరి ఇటువంటి తరుణంలో ఈ వీపీఎన్ లపైన కూడా ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.

2 thoughts on “VPN లను బ్యాన్ చేయాలంటూ కేంద్రానికి స్టాండింగ్ కమిటీ సిఫార్సు”

Leave a Comment