బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అద్భుత ఫలితాలు సాధించింది. మరీ ముఖ్యంగా తెలంగాణలోని దుబ్బాకలో బీజేపీ అనూహ్య సంచలన విజయం సాధించింది. దీంతో తెలంగాణలో రాజకీయ పెను మార్పులకు నాంది పలకబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బండి సంజయ్ నాయకత్వంలో తెలంగాణలో బిజెపి రాజకీయ బండి అధికారం వైపు నడక సాగిస్తోందని ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం తెలంగాణా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో దుబ్బాకలో మూడో స్థానానికి పరిమితమైన బిజెపి.. స్వల్ప కాల వ్యవధిలో అనూహ్య విజయం సాధించడం నిజంగానే ఆ పార్టీ శ్రేణులకు కొత్త శక్తినిచ్చినట్టైంది.
అయితే ఎంకి పెళ్ళి సుబ్బి చావు కొచ్చింది అన్న చందంగా దుబ్బాక గెలుపు ఏపీలో టీడీపీ పతనానికి కూడా పునాదులు వేస్తుందని అభిప్రాయాలు లేకపోలేదు. ఎందుకంటే తెలంగాణలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ను పూర్తిగా పతనం చేస్తూ ఆ పునాదుల మీద బీజేపీ తన రాజకీయ సౌధాన్ని నిర్మించుకుంటుందో .. ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే ఫార్ములాని బీజేపీ తప్పక అనుసరిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ నేపథ్యంలో ప్రధానంగా పతనం చేయాల్సిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది టీడీపీ అని బీజేపీ భావిస్తోంది. ఈ విషయమై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల అనేక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు కూడా. అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవడంలో బిజెపికి మించిన రాజకీయ పార్టీ మరేదీ లేదని అందరూ చెప్పే మాట.
ఉదాహరణకు దుబ్బాకని తీసుకుందాం.. 2018 ఎన్నికల్లో దుబ్బాక నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు ముత్యంరెడ్డి మీద 62500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానానికి పరిమితమైంది. అయితే కేవలం రెండు సంవత్సరాలలో బీజేపీ మూడో స్థానం నుంచి అమాంతం విజయ శిఖరాలను అధిరోహించి రికార్డు నెలకొల్పింది. దీని వెనుక ఎంతో పోరాటపటిమ దాగి ఉంది.
తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అంటూ బీజేపీ మాటలతో కాకుండా చేతులతో ఈ విషయం ద్వారా చాటిచెప్పింది. ఈ నేపథ్యంలో బిజెపి చూపు సహజంగానే మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ పై తప్పక పడుతుంది. ఏపీలో బలపడడానికి బీజేపీ ఇప్పటికే ప్రణాళికలు రచిస్తోంది.
ముఖ్యంగా అధికార పార్టీ వైసిపి ఓటు బ్యాంకు ముస్లింలు, క్రిస్టియన్లు, రెడ్లు, దళితులు, బీసీలు 40 శాతం ఉంటుంది. బిజెపి సిద్ధాంతపరంగా వైసిపి ఓటు బ్యాంకు పూర్తి విరుద్ధం. అందువల్ల బలపడాలంటే దెబ్బతీయాల్సింది టీడీపీనే అని బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చింది. అందుకే గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత మిత్రత్వం కోసం వెంపర్లాడుతున్న టిడిపిని బీజేపీ ఏమాత్రం చెక్కు తీయడం లేదు.
మరోవైపు కరోనా ఎఫెక్ట్ తో చంద్రబాబు నాయుడు ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి. అలాగే జగన్ సర్కారు ఉక్కుపాదం మోపుతుండడంతో టీడీపీ నేతలు వణికిపోతున్నారు. జగన్ సర్కార్ కి ఎదురొడ్డి పోరాడాలి అంటే చంద్రబాబు నాయకత్వం భరోసా ఇవ్వలేదు అనే వాదన కూడా బలంగా ఉంది. వీటన్నిటినీ అవకాశంగా తీసుకుని ఏపీలో బీజేపీ బలపడానికి సిద్ధమవుతోంది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …