గుజరాత్ లో బీజేపీ పట్టుకోల్పోతోందా .. ?

గుజరాత్ లో శనివారం ఉన్నట్టుండి అనూహ్య రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. అక్కడ సీఎం విజయ్ రూపాని తన పదవికి రాజీనామా చేశారు. నిజానికి ఈ రాజీనామాను ఎవరూ ఊహించలేదు. తనకు ప్రస్తుతం ఆరోగ్యం సహకరించడం లేదని.. అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను ప్రధాని మోడీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. తనకు అవకాశం కల్పించిన నరేంద్రమోడీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ( యడ్యూరప్ప పదవీకాలం ఎప్పుడూ అసంపూర్ణమే..! )

గుజరాత్ రాజకీయాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి

ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా కు గుజరాత్ సొంత రాష్ట్రం అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక్కడి రాజకీయాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మరో ఏడాదిలో అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ రూపాని రాజీనామా ఆసక్తికరంగా మారింది. బీజేపీ హైకమాండ్ బలమైన కారణంతో విజయ్ రూపానిని రాజీనామా చేయించిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఓవైపు పటేల్ సామాజిక వర్గం ఆ పార్టీకి క్రమంగా దూరమైంది. హార్దిక్ పటేల్ గత అసెంబ్లీ ఎన్నికల ముందు పటేళ్లకు రిజర్వేషన్లు తీసుకువచ్చే అంశాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ వెంట ఉన్నారు. మరోవైపు విజయ్ రూపాని పెద్దగా మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్ కాదు. ఈ క్రమంలో ఆయనను నమ్ముకుంటే గుజరాత్ ఎన్నికలు జయించడం కష్టమని బీజేపీ హైకమాండ్ భావించినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్ష పదవికి భారత్

ప్రస్తుతం గుజరాత్లో దళితులు, పటేల్లు బిజెపికి దూరమయ్యారు. ముస్లింలు ఎలాగూ ఆ పార్టీకి మద్దతు ఇవ్వరు. ఈ క్రమంలో సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ రూపాని స్థానంలో పటేల్ సామాజిక వర్గానికి చెందిన నేతను సిఎం పీఠం ఎక్కిస్తారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవ్య, గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ భాయ్ పటేల్ సీఎం రేసులో ఉన్నట్లు సమాచారం. గుజరాత్ లో పటేల్ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు బీజేపీ హైకమాండ్ ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Comment