ఓటర్ ఐడితో ఆధార్ అనుసంధానం.. ఇది సాధ్యమయ్యే పనేనా.. !!

ఓటర్ ఐడితో ఆధార్ అనుసంధానం : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే ఆధార్ కార్డ్ కాన్సెప్ట్ ని తెర మీదికి తీసుకువచ్చింది. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి అంటూ జీవోలు కూడా జారీచేసింది. ఎలాంటి కార్యకలాపాలు కొనసాగించాలన్నా కూడా ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది.

ఇప్పుడు మరో కొత్త నిర్ణయంతో కేంద్రం ముందుకు రానుంది. అదే ఓటర్ ఐడితో ఆధార్ అనుసంధాన ప్రక్రియ. ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ వంటి ముఖ్యమైన వాటికి ఆధార్ ను అనుసంధానం చేసింన కేంద్రం ఇప్పుడు మరో ముఖ్యమైన ఓటర్ కార్డుకు కూడా ఆధార్ ను అనుసంధానం చేయాలన్న నిర్ణయాన్ని పరిశీలిస్తోంది. దీనివల్ల ఓటరు నమోదు ప్రక్రియ సులభతరం అవుతుందని కేంద్రం భావిస్తోంది. ( వాట్సాప్ కు పోటీగా భారత ప్రభుత్వ రూపకల్పనలో ఒక కొత్త ఆప్ ..! )

ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో ఒక్కసారి కాకుండా, ఒక ప్రాంతంలోనే కాకుండా ఎన్నోసార్లో ఓటు హక్కు దుర్వినియోగం చేయడం జరుగుతూ వస్తుంది. అప్పుడప్పుడు కొన్ని దొంగ ఓట్లకు సంబంధించిన అంశాలు కూడా తెర మీదకి వచ్చిన సందర్భాలు చూసాము.

అందుకే ఇలాంటివి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక వ్యక్తికి ఒకే ప్రాంతంలో ఓటు కలిగి ఉండేలా చేసేందుకు ఒక సరికొత్త కార్యాచరణ మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం.

దీనికి అనుగుణంగానే ఓటర్ ఐడితో ఆధార్ కార్డు అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా వివిధ ప్రాంతాలలో ఒకే వ్యక్తి ఓటు వేసేందుకు అవకాశం లేకుండా పోతుందని.. ఇది ఒక మంచి నిర్ణయంగా కేంద్ర ప్రభుత్వం పై ప్రశంసలు కురిపిస్తున్నారు పలువురు విశ్లేషకులు.

Leave a Comment