GHMC ఎన్నికల వేళ బిజెపి, జనసేన మధ్య సంబంధాల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ లో బిజెపి, జనసేన కలిసి పోటీ చేస్తాయని అందరూ కూడా భావించారు.
చాలా కాలంగా బీజేపీ, జనసేన పార్టీలు అటు ఆంధ్రప్రదేశ్లో, ఇటు తెలంగాణాలో కలిసి ప్రయాణిస్తున్నాయి. అలాగే ప్రతి విషయంలో కూడా జనసేన, బీజేపీకి మద్దతు ఇస్తూ వస్తుంది. జాతీయ స్థాయిలో కూడా బిజెపి విధానాలను పవన్ కళ్యాణ్ సమర్ధిస్తూ వచ్చారు.
గ్రేటర్ లో ఆంధ్రా ఓటర్లు ఉన్న నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో బిజెపి తప్పనిసరిగా జనసేన మద్దతు తీసుకుంటుందని భావించారు. కానీ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికల్లో ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవడం లేదని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. పొత్తు విషయంలో ఎవరు కూడా తమను సంప్రదించలేదని కూడా చెప్పారు.
మొత్తం 150 డివిజన్లో కూడా బిజెపినే పోటీ చేస్తుంది అని ఒక టీవీ చానల్ వద్ద బండి సంజయ్ స్పష్టం చేశారు. దీన్ని బట్టి జనసేన మద్దతు కోరే ఆలోచన కూడా బీజేపీకి లేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు బిజెపి నుంచి ఎలాంటి పిలుపు లేకపోవడంతో.. జనసేన నుంచి ఒక కీలకమైన ప్రకటన పవన్ కళ్యాణ్ పేరు మీద విడుదలైంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జనసేన పోటీ చేయబోతోందని, యువ కార్యకర్తల ఒత్తిడి మేరకు తాము గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆ ప్రకటనలో పవన్కళ్యాణ్ వివరించారు. అయితే ఆ ప్రకటనలో ఎక్కడా కూడా బీజేపీతో కలిసి పోటీ చేస్తామని కానీ.. బీజేపీకి మద్దతు ఇస్తామని కానీ ఎక్కడ చెప్పకుండా, కార్యకర్తలు ఒత్తిడి మేరకు అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
అంటే దీనిని బట్టి పవన్ కళ్యాణ్ కూడా బిజెపి తన నుంచి మద్దతు తీసుకునేందుకు సిద్ధంగా లేదు అని ఒక అభిప్రాయానికి పవన్ కళ్యాణ్ వచ్చి ఉంటారు. అందుకే గ్రేటర్ ఎన్నికల్లో దాదాపు ఒంటరిగానే పోటీ చేయబోతున్నామన్న సంకేతాలు పవన్ కళ్యాణ్ తన ప్రకటన ద్వారా తెలిపారని తెలుస్తుంది.
చాలా కాలంగా చాలా విషయాల్లో పవన్ కళ్యాణ్ బిజెపికి సపోర్ట్ చేస్తూ వచ్చారు. బండి సంజయ్ ని కూడా కలిశారు. దుబ్బాక లో బీజేపీ గెలిచినప్పుడు కూడా రఘునందన్ ను జనసేన అభినందించింది. అయినప్పటికీ కూడా గ్రేటర్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి బిజెపి పవన్ కళ్యాణ్ ని సంప్రదించలేదు అన్న విషయం అర్ధమవుతోంది.
దీంతో ఈ రెండు పార్టీలూ ఒంటరిగా పోటీ చేయడానికి దాదాపు సిద్ధమైనట్లు గా అనిపిస్తోంది. ముందు పెద్దన్న పాత్ర పోషించాల్సిన బీజేపీ పవన్ కళ్యాణ్ ను సంప్రదించి ,GHMC ఎన్నికలకు కలుపుకొని వెళ్తుంది అని అందరూ భావించారు. కానీ పవన్ కళ్యాణ్ మద్దతు లేకుండానే ఒంటరిగా ముందుకెళ్లేందుకు తెలంగాణ బీజేపీ సిద్ధపడింది అన్నది కూడా స్పష్టమవుతోంది.
ఈ విషయంలో ఇంతటితో ఇలా రెండు పార్టీలు ఒంటరిగా పోటీ చేయడానికే మొగ్గుచూపుతాయా లేకుంటే మరేమైనా చర్చలు జరిగి పవన్ కళ్యాణ్, బీజేపీతో కలిసి ఎన్నికల్లో ముందుకు వెళ్తాయా అన్నది ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …