ఏపీలో అధికారాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ వేగంగా పావులు కదుపుతుందా..?, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు ( Somu Veerraju ) కాపు సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునేందుకు కొత్త వ్యూహాలు రచిస్తున్నారా?, కాపు రాజకీయాన్ని బీజేపీ ఇకమీదట జనసేన పార్టీతో కలిసి బలంగా చేయబోతుందా?, తన సామాజిక వర్గం నుంచే ఈ ప్రయత్నం ప్రారంభించి త్వరలో దీనికి ఓ రూపు తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నారా? ఇంతకీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యూహాలు ఏమిటి? ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిణామాలపై జోరుగా చర్చ సాగుతోంది.
ఏపీలో జనాభా పరంగా మెజారిటీ ఉన్న కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు మరో ప్రయత్నంగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కాపు సామజిక వర్గానికి చెందిన సోము వీర్రాజుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టడంతో ఆయన కాపు ఓట్ల సమీకరణపై దృష్టి సారించారు. ముఖ్యంగా రాష్ట్రంలో తమ బలం ఏమిటన్న దానిపై స్పష్టత కలిగిన సోము వీర్రాజు బీజేపీ ( BJP ) అధిష్టానం అండతో దూకుడు ప్రదర్శిస్తున్నారు.
ఒకే జిల్లా వారు
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సోము వీర్రాజు ఇప్పటికే చిరంజీవితో (Megastar Chiru ) పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pavan Kalyan) లతో సమావేశమయ్యారు. ముద్రగడ వంటి కాపు నేతలను తనకు సహకరించాలని కోరడం మరో కొత్త సమీకరణాలకు తెరతీసింది. ఉభయగోదావరి జిల్లాల్లో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు సోము వీర్రాజు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇక్కడి కాపు నాయకులను ఆకర్షించే పనిలో ఆయన బిజీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అధికార పార్టీకి పోటీగా
ఇప్పటికే ఏపీలో అధికార వైసీపీ (YCP) ఒక సామాజిక వర్గానికి, విపక్ష టీడీపీ (TDP) మరో సామాజిక వర్గానికి దగ్గరగా ఉన్నాయని, ఆ రెండు పార్టీల మాదిరిగానే బీజేపీ కూడా ఒక సామాజిక వర్గాన్ని తమ ఆధీనంలో ఉంచుకోవాలనుకున్న ఆలోచనలో ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తన సామాజిక వర్గానికి చెందిన వారిని దగ్గరకు తీసి బీజేపీలో యాక్టివ్ రోల్‌లో ఉంచేలా ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది.
ఇక్కడ పార్టీలు తాము ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లం కాదని, అన్ని సామాజిక వర్గాలు తమకు సమానమే చెబుతున్నా.. ఆ పార్టీలు సామాజిక వర్గాల వారీగా ఎప్పుడో విడిపోయాయన్న వాదన రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఆ రాజకీయ సమీకరణాల బాటలో ఇప్పుడు బీజేపీ కూడా పయనిస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …