Clinical Trails | అపర కుబేరుడు, అంతర్జాతీయ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అయిన బిల్‌గేట్స్ ( Bill Gates ) ప్రతిష్ఠ క్రమంగా మసకబారుతున్నట్లు కనిపిస్తోంది. తను గేట్స్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా పేద దేశాలకు వ్యాక్సిన్లు, ఇతర వైద్య సదుపాయాలను కల్పిస్తున్నారు.
ఇప్పుడు అలంటి ఫౌండేషన్ పై పలు ఆరోపణలు వ్యక్తమౌతోన్నాయి. ఇదే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమాయక గిరిజన బాలికలపై ( tribal girls )అనధికారికంగా వ్యాక్సిన్లకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారని, వాటికి పెద్ద ఎత్తున నిధులను సమకూర్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Clinical Trails on Tribal Girls
తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన 14 వేల మంది గిరిజన బాలికలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు గ్రేట్‌గేమ్ ఇండియా తన వెబ్సైటు లో ఓ ప్రత్యేక కథనాన్ని రాసింది. 2009లో తెలంగాణ సహా నాగాలాండ్‌లోని గిరిజన బాలికలపైనా ఈ క్లినికల్ ట్రయల్స్ చేపట్టినట్లు ఆ సంస్థ పేర్కొంది.
Gardasil Vaccine
అత్యంత వివాదాస్పదమైన గర్డాసిల్ వ్యాక్సిన్ ( gardasil vaccine ) క్లినికల్ ట్రయల్స్ ఆ బాలికలపై జరిపించారని తెలిపింది. సెక్సువల్లీ ట్రాన్స్‌మీట్ అయ్యే ఇన్‌ఫెక్షన్ కలిగిన హ్యూమన్‌పాపిలోమా వైరస్ ( Human Papillomaviru ) ను నివారించడానికి ప్రయోగించిన వ్యాక్సిన్ అది. ( CORONA BIO-WAR )
ఎన్జీఓ సంస్థ అయినటువంటి ప్రోగ్రామ్ ఫర్ అప్రాప్రియేట్ టెక్నాలజీ ఇన్ హెల్త్ (పాత్) అమెరికాలోని సియాటెల్ ప్రధాన కేంద్రంగా దాదాపు అన్ని దేశాల్లోనూ విస్తరించి వుంది. దీని ద్వారా గేట్స్ ఫౌండేషన్ ఈ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించినట్లు గ్రేట్‌గేమ్ ఇండియా స్పష్టం చేసింది. ( 2-Deoxy-D-glucose )
2009వ సంవత్సరంలో దాదాపు 14 వేల మంది కోయ, గిరిజన తెగకు చెందిన 10 నుంచి 14 సంవత్సరాల్లోపు బాలికపై ఈ ప్రయోగాలు సాగాయని తన కథనంలో తెలిపింది. ఈ పాత్ అనే ఎన్జీఓ సంస్థ తమ క్లినికల్ ట్రయల్స్ కోసం వసతి గృహాల్లో మరియు ఇంటికి దూరంగా నివసించే బాలికలను ఎంచుకుందని తెలిపింది.
ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు
ఈ ప్రయోగాలు చాలా వరకు వికటించాయని, పలువురు గిరిజన బాలికలు దీర్ఘకాలిక అనారోగ్యానికి గురయ్యారని, ఇందులో కొందరు మరణించారని కూడా వివరించింది. మరో విషయం ఏమిటంటే తమ పిల్లలకు గర్డాసిల్ అనే వ్యాక్సిన్‌ను ఇచ్చారన్న విషయం వారి తల్లిదండ్రులకు కూడా తెలియదని తన కధనంలో పేర్కొంది.
ఇటువంటి పరిస్థితులు ఖమ్మం జిల్లా గిరిజనుల్లోనే కాకుండా నాగాలాండ్‌లోని కొన్ని గిరిజన కుటుంబాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు అంచనా వేసింది. ఇప్పటికీ ఇలాంటి క్లినికల్ ట్రయల్స్ ఏదో చోట జరుపుటూనే వుంటారు. ఇలా ఉచిత వైద్యం పేరుతొ గిరిజన బాలికలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్న ఎన్జీఓ సంస్థలపై ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా అమృత్ …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో జనజీవనం …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్‌కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ సిఫార్సుల …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక కొత్త …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం పాటు …