బిగ్ బాస్ షో ఫాన్స్ కు గుడ్ న్యూస్ : Bigg Boss Season 5

Bigg Boss Season 5: బుల్లితెరపై తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న షో బిగ్ బాస్ (Bigg Boss ). ఐదేళ్ల క్రితం తెలుగులోకి వచ్చి ఎవరూ ఊహించని విధంగా సూపర్ సక్సెస్ అయింది బిగ్ బాస్ షో. ఇప్పటికే ఏకంగా నాలుగు షోలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ ను Jr NTR, రెండవ సీజన్ ను నాని (Nani), 3 – 4 సీసన్ లను నాగార్జున వ్యాఖ్యాతలుగా తమ తమ అద్భుతమైన చాతుర్యంతో బాగా గుర్తింపు లభించింది. ( Pushpa Movie Updates )

దేశం మొత్తంగా చాలా భాషల్లో బిగ్ బాస్ షో ప్రసారం అవుతున్నా.. అన్ని చోట్ల కంటే తెలుగులో వచ్చే దానికే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. అందుకే ఇక్కడ ప్రతి ఏడాది సరికొత్త రికార్డును నమోదు చేసుకుంటుంది. మరీ ముఖ్యంగా అక్కినేని నాగార్జున (Nagarjuna ) వ్యాఖ్యాతగా వ్యవహరించిన 4వ సీజన్లో కు 18 పైచిలుకు రేటింగ్ లభించింది. ఇప్పుడు 5వ సీసన్ కు సమయం ఆసన్నమైంది.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ షో మొదలయ్యేది కష్టమే అన్న టాక్ మొదట్లో వినిపించింది. అంతేకాదు ఈ ఏడాది బిగ్ బాస్ షో ఉండదంటూ పుకార్లూ వినిపించాయి. దీంతో బిగ్ బాస్ షో అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఏది ఏమైనా ఈసారి బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమవుతుందని వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో కంటెస్టెంట్లు వీళ్ళే అంటూ కొన్ని పేర్లు తెరపైకి వస్తున్నాయి.

ఇదే సమయంలో బిగ్ బాస్ ఐదో సీజన్ కు సంబంధించిన సమాచారం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. సీసన్ 5ని గ్రాండ్ గా ప్రారంభించాలని దానికోసం భారీ సెట్ కూడా నిర్మించినట్టు తెలుస్తోంది. ఈ సీసన్ ఫస్ట్ టీసర్ వచ్చే నెలలో బయటకు రానుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడనుందని తెలుస్తోంది. ఎంత కష్టమైనా ఈ సెప్టెంబర్ 5న బిగ్ బాస్ షో మొదలుపెట్టాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Comment