బిగ్ బాస్ 4 ఇంకా మొదలు కాక ముందే నిర్వాహకులకు టెన్షన్ మొదలైంది. మామూలుగా అయితే బిగ్ బాస్ మొదలవుతుందంటే చాలు, ఇటు టివి ఛానెళ్ళు , అటు సోషల్ మీడియాలో హడావిడి అంతా ఇంతా కాదు. హోస్టింగ్ ఎవరు వుంటారు, కంటెస్టెంట్లు ఎవరెవరు పాల్గొంటారు రకరకాల ప్రచారాలు మొదలవుతాయి.
అయితే ఇప్పటికే బిగ్ బాస్ 4 సీసన్ కి నాగార్జున అక్కినేని హోస్టింగ్ గా కంఫర్మ్ అయ్యారు. 16 మంది కంటెస్టెంట్లు కూడా సెలెక్ట్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఇందులో ఒకరుగా నందు స్వయంగా తానే పాల్గొంటున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు కూడా. అయితే ఈ కరోనా నేపథ్యంలో ప్రోగ్రాంలో పాల్గొనే సభ్యులందరి ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షించాల్సిన భాద్యత కార్యక్రమ నిర్వాహకులది. ఎందుకంటే ఈ బిగ్ బాస్ హౌస్ లో అందరు సమూహంగా కలిసి ఉండాల్సిన పరిస్థితి. ( ఇద్దరు సింగెర్స్ కి కరోనా..! )
అందరికి కరోనా పరీక్షలు చేసిన తర్వాత నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే అందులో పాల్గొనాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కార్యక్రమం మొదలవక ముందే ఒక కంటెస్టెంట్ ఒకరికి కరోనా పాజిటివ్ అని తెలిసింది. ఇప్పటికే అందరికి పరీక్షలు నిర్వహించి నెగిటివ్ రిపోర్ట్ వచ్చాకనే ఒక ప్రముఖ హోటల్లో ఉంచడం జరిగింది. తాజాగా ఇందులో ఒకరికి పాజిటివ్ అని తెలియడంతో నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. అతను ఒక యువ గాయకుడని , కుర్రాడు కావడంతో త్వరగా కోలుకుంటాడని సభ్యులందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా షో మొదలు కావడానికి సమయం ఉన్నందున ఈలోపు త్వరగా కోలుకోవాలని నిర్వాహకులు ఎదురు చూస్తున్నారు. అయినా ఇలా షో మొదలు కాక ముందే కరోనాతో కలవరం మొదలైందని చెప్పాలి.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …