వైసీపీలోకి భూమా మౌనిక రెడ్డి..? అక్క అఖిలప్రియకు చెక్ పడనుందా ..!

భూమా కుటుంబంలో తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. అక్క అఖిలప్రియకు, చెల్లెలు మౌనిక రెడ్డి లకు మధ్య ఆస్తి తగాదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవహారాల మధ్య తేడాలు రావడంతో అఖిలప్రియ, మౌనిక రెడ్డి ల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇద్దరి మధ్య మాటలు కూడా లేవని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇద్దరు కోర్టుకు కూడా వెళ్లడానికి రెడీ అవుతున్నారని సమాచారం.

నిజం చెప్పాలంటే ఒకప్పుడు కర్నూలు జిల్లాలో భూమా కుటుంబానికి మంచి పేరుంది. అటు నంద్యాల ఇటు ఆళ్లగడ్డలో ఒక పార్టీ నుంచి పోటీ చేసినా విజయం సాధించేవారు. 2014కు ముందు భూమా కుటుంబం వై.సి.పి.లో చేరారు. ఆ సమయంలో భూమా శోభానాగిరెడ్డి మరణించడం జరిగింది. ఆమె మరణించిన దగ్గర్నుంచి భూమా ఫ్యామిలీ పతనం మొదలైందని చెప్పాలి.

మంత్రి పదవికి ఆశపడి

అప్పుడున్న టీడీపీ ప్రభుత్వం మంత్రి పదవి ఆశ చూపడంతో భూమా నాగిరెడ్డి ఆయన కూతురు అఖిలప్రియ వైసిపి లో గెలిచినా కూడా టిడిపి కండువా కప్పుకున్నారు. అయితే నాగిరెడ్డికి మంత్రి పదవి రాలేదని మనోవేదనతో టిడిపిలో చేరిన కొన్నాళ్లకే ఆయన మరణించారు. తండ్రి మరణంతో అఖిలప్రియకు మంత్రి పదవి దక్కింది.

ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. 2019 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. నంద్యాల మరియు ఆళ్లగడ్డ రెండు చోట్ల భూమా ఫ్యామిలీ ఓడిపోయింది. అప్పట్నుంచే భూమా అఖిలప్రియకు కష్టాలు మొదలయ్యాయి. హైదరాబాద్ లో కిడ్నాప్ మరియు ల్యాండ్ ఇష్యూ లలో అఖిలప్రియ నేరుగా పాల్గొనడంతో ఆమె అరెస్టయి జైలు జీవితం కూడా గడిపారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు మరింత కష్టాలు మొదలయ్యాయి.

సొంత చెల్లిలితో ఆమెకు విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. చెల్లితో పాటు ఇతర ఆర్థిక వ్యవహారాల్లో తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో నంద్యాల డైరీ కూడా తన చేతిలో నుంచి వెళ్లిపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు భూమా ఫ్యామిలీ. ఇదే సమయంలో అండగా ఉండాల్సిన టిడిపి పార్టీ కూడా భూమా అఖిలప్రియను దూరం పెట్టినట్లు తెలుస్తుంది. జైలుకు వెళ్లినప్పటి నుంచి చంద్రబాబు, లోకేష్ పెద్దగా పట్టించుకోవాటం మానేశారు. దీంతో మనస్తాపానికి గురైన అఖిలప్రియ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. దాంతో భూమా అఖిలప్రియ తిరిగి వైసీపీలో చేరాలని చూస్తున్నారట.

భూమా అఖిల ప్రియ బంధువులు అంతా కూడా వైసిపిలోనే కొనసాగుతున్నారు. ఎస్వి మోహన్రెడ్డి, కాటసాని రామిరెడ్డి మొదలగు వారంతా కూడా వైసీపీలోనే కొనసాగుతున్నారు. భూమా అఖిలప్రియ రాజకీయ జీవితాన్ని ఎలాగైనా గాడిలో పెట్టాలని చూస్తున్నారట మేనమామ ఎస్వి మోహన్రెడ్డి. ఆమెను తిరిగి వైసిపిలోకి తీసుకురావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే వైసీపీ అధ్యక్షుడు జగన్ తో దీనిపై చర్చించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

అక్కాచెల్లెళ్ల పోటాపోటీ

అయితే ఇక్కడే అందరికీ దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు అఖిల ప్రియ చెల్లెలు మౌనిక రెడ్డి. ఆమె కూడా రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారట. అందుకే అక్క కన్నా ముందే తానే వైసీపీలో చేరాలని చూస్తున్నారట. దీనిపై ఇప్పటికే అనుచరులతో కూడా చర్చించారట మౌనిక రెడ్డి. త్వరలోనే ఆమె జగన్ తో సమావేశం కావడానికి కూడా రెడీ అవుతున్నారని సమాచారం.

అఖిలప్రియ, మౌనిక రెడ్డి .. ఇద్దరిలో మౌనిక రెడ్డికి ఓటు వేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే అక్క అఖిలప్రియ కన్నా మౌలిక రెడ్డి మంచి వాగ్దాటి. పైగా ఎటువంటి రిమార్క్ కూడా లేదు. అదే అఖిలప్రియ అయితే వైసిపిలో గెలిచి మంత్రి పదవి కోసం టీడీపీలో చేరి చివరికి జైలుపాలయ్యారు. ఇప్పుడు టిడిపి పార్టీలో ఆదరణ లేక వైసిపిలోకి రావాలని చూస్తుంది. కాబట్టి మౌనిక రెడ్డికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు వైసిపి నాయకులు అనుకుంటున్నారు.

Leave a Comment