భారత్ బయోటెక్ మరో ముందడుగు..(Bharat Bio-Tech)

కరొనాను అరికట్టేందుకు కో-వాక్సిన్ టీకాను తయారు చేస్తున్న భారత్ బయోటెక్, ఈ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ అఫ్ మెడిసిన్ ముక్కు ద్వారా ఇచ్చే టీకాను అభివృద్ధి చేస్తుంది. దీన్ని ఉత్పత్తి చేసేందుకు భారత్ బయోటెక్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు కోటి టీకాల వరకు మొదటి దశలో ఉత్పత్తి చేస్తామని భారత్ బయోటెక్ చెబుతోంది.

వాషింగ్టన్ అభివృద్ధి చేస్తూన్న టీకాను ముక్కు సులభంగా ద్వారా లోపలి పంపిస్తారు. దీని వల్ల ముక్కులో,గొంతులో ఉన్న వైరస్ తవ్రగా చనిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. ఇంజక్షన్ ద్వారా బోడీలోకి ఇచ్చే టీకా కాకుండా ముక్కు ద్వారా ఇవ్వటం మంచి ఫలితాలు ఇస్తాయని అంటున్నారు. దీని వలన ఇంజక్షన్స్ కి అయ్యే కోట్లాది రూపాయలు కూడా మిగులుతాయని అంటున్నారు.

ప్రస్తుతం తయారీలో ఉన్న టీకాల కన్నా ఇది మెరుగ్గా పనిచేస్తుందని , ఈ వాక్సిన్ ను సింగల్ డోస్ లో ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. వాక్సిన్ ను త్వరగా ప్రజల ముందుకు తీసుకు వస్తామని దానికి సంభందించిన మొదటి దశ ప్రయోగాలు సెయింట్ లూయిస్ లో జరుగుతాయని తెలిపింది. ఇప్పటికే రష్యా వంటి దేశాలు వాక్సిన్ తయారీలో ఒక అడుగు ముందుకే వున్నాయి. ఈ వాక్సిన్ ను అమెరికా , జపాన్ వంటి దేశాల్లో పంపిణీ కూడా భారత్ బయోటెక్ చేపట్టనుంది.

Leave a Comment