వాటర్‌ బాటిల్‌ కంటే తక్కువ ధరలోనే కరోనా వ్యాక్సిన్‌

Krishna Bio

వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ఎంతో నైపుణ్యత సాధించామని భారత్‌ బయోటెక్‌ ఎండి కృష్ణ ఎల్లా తెలిపారు. కానీ కొత్త వైరస్‌ కావడం వల్ల అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని వివరించారు. అయినా, వాటర్‌బాటిల్‌ ధరకంటే తక్కువకే వ్యాక్సిన్‌ను అందిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని జినోమ్‌వ్యాలీలో ఉన్న భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ ప్రొడక్షన్‌ సెంటర్‌లో ఆయన మాట్లాడారు. అమెరికా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంతో సహకారం అందిస్తున్నాయని కృష్ణ్ణ ఎల్లా పేర్కొన్నారు. ‘మేము మార్కెట్‌లో పోటీదారులం కావొచ్చు.. మా అందరి పోరాటం కరోనాను జయించడంపైనే’నని స్పష్టం చేశారు.

ఉత్పత్తిలో మనదే అధిక వాటా

భారత వ్యాక్సిన్‌ ఉత్పత్తిలో 70 శాతం వాటా మూడు హైదరాబాద్‌ కంపెనీలదేనన్నారు. భారతదేశ ఆవిష్కరణల్లో తెలంగాణ నాయకత్వ స్థానంలో ఉంటుందని తెలిపారు. ప్రపంచంలో ఏ వ్యాక్సిన్‌ కంపెనీ కంటే కూడా హైదరాబాద్‌ కంపెనీలు తక్కువ కాదని కృష్ణ ఎల్లా అన్నారు. ప్రభుత్వం కరోనాను ఆరోగ్యపరమైన సంక్షోభంగానే చూస్తోందన్నారు. కరోనా భారీ ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ల అభివృద్ధి కంపెనీలతో కేంద్రం సంప్రదింపులు జరపాలన్నారు. వేగంగా వ్యాక్సిన్‌ తేవడానికి ఎవరి అవసరాలు ఏమిటో తెలుసుకోవాలని తెలిపారు.

ప్రపంచంలోని ఏ వ్యాక్సిన్‌ కంపెనీ కంటే కూడా హైదరాబాద్‌ కంపెనీలు తక్కువ కాదన్న కృష్ణ్ణ ఎల్లా వాటర్‌ బాటిల్‌ కంటే తక్కువ ధరలోనే వ్యాక్సిన్‌ను తీసుకొస్తామని చెప్పారు. ప్రపంచం మొత్తానికి ఒకే నాణ్యతతో కూడిన వ్యాక్సిన్‌ను అందిస్తామని కృష్ణ ఎల్లా స్పష్టం చేశారు.

Leave a Comment