మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తుల జప్తుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తమ బ్యాంకు కు రావాల్సిన బకాయిలను చెల్లించకపోవడంతో అధికారులు ఆస్తుల జప్తుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం.
టిడిపి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇండియన్ బ్యాంకు లో ఆయన తీసుకున్న 248 కోట్ల రూపాయలకు బకాయిలు ఉండగా ఈ నెల 25న ఆన్లైన్ యాక్షన్ కూడా నిర్వహించేందుకు బ్యాంకు అధికారులు సిద్ధం చేసుకున్నారు.
ఈ మేరకు పలు సెక్షన్ కింద కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. గంటా శ్రీనివాసరావు మొత్తం 248 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఈ నెల 25న బ్యాంకు అధికారులు ఆన్లైన్ ఆక్షన్ నిర్వహించనున్నట్లు నోట్ విడుదల చేసింది.
ఇండియన్ బ్యాంక్ నుంచి ప్రత్యూష రిసోర్సెస్ ఇన్ఫ్రా కంపెనీ కొన్నాళ్ళ క్రితం లోన్ తీసుకుందట. అయితే దానికి సంబంధించి 141.48 కోట్లు రూపాయలు బ్యాంకుకు బకాయి పడింది. ఆ కంపెనీకి గంటా శ్రీనివాసరావు గతంలో డైరెక్టర్గా వ్యవహరించారు. అయితే బకాయిలను చెల్లించాలని 2016 అక్టోబర్ 4న మొదటిసారిగా ప్రత్యూష కంపెనీకి ఇండియన్ బ్యాంక్ నోటీసులు కూడా పంపించింది.
కానీ రుణం చెల్లించలేక ఆ కంపెనీ చేతులెత్తేసింది. ఇన్నాళ్ల పాటు చెల్లించకపోవడంతో వడ్డీతో సహా అన్నీ కలిపి ఆ రుణం విలువ 248 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలోనే రుణం కోసం ప్రత్యుష గ్రూప్ ఆస్తులన్నీ కూడా వేలం వేయాలని ఇండియన్ బ్యాంకు సంచలన నిర్ణయం తీసుకుంది.
రుణాల చెల్లింపుకు బాధ్యులుగా గంటా శ్రీనివాసరావుతో పాటు, పీవీ ప్రభాకర్ రావు, పీవీ భాస్కర రావు, పి రాజారావు, అమూల్య, కే వి సుబ్రహ్మణ్యం, ప్రత్యూష రిసోర్సెస్ ఇన్ఫ్రా కంపెనీలకు ఇండియన్ బ్యాంకు తన నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ పదవి నుంచి 2011 సంవత్సరంలోనే తప్పుకున్నానని, ఆ సంస్థ ఆర్థిక లావాదేవీలతో తనకు సంబంధం లేదని గంటా శ్రీనివాసరావు గతంలో కూడా ప్రకటించారు.
వేలం వేసే ఆస్తుల జాబితాలో ఆయనకు చెందిన ఆస్తులు కూడా ఉండటం విశేషం. టీడీపీ హయాంలో గతంలో ఎన్ని రకాల అక్రమాలు చేసారో అనే దానిపై ఇప్పుడు వస్తున్న కథనాలు చూస్తుంటే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఏదో కంపెనీల పేర్లు చెప్పడం, వేలకు వేల కోట్ల రూపాయలను బ్యాంకు నుంచి రుణాలు ఎగ్గొట్టడం.. మళ్లీ ఏదో ఒక రాజకీయ పరంగా వాడుకోవడం లాంటివి మనం రోజూ చూస్తూనేవున్నాం.
ఇలాగే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పై కూడా ఎన్నో కథనాలు వస్తున్న ఈ తరుణంలో నేడు ఇండియన్ బ్యాంక్ ఇచ్చిన ఈ షాక్ తెలుగుదేశం పార్టీ కూడా బలంగా తగిలే అవకాశం ఉంది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …