ఫ్రస్ట్రేషన్ కాదు.. అయ్యన్నపాత్రుడు కావాలనే అలా.. !

ఏపీలో రాజకీయాలు ఎంత తారా స్థాయికి దిగజారాయో చెప్పడానికి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. సరే ఆయన ఏదో కార్యకర్తలను చూసి ఉత్సాహంతో అలా మాట్లాడారేమో అని సరిపెట్టుకొనేందుకు కూడా తెలుగుదేశం పార్టీ అవకాశం లేకుండా చేసింది. అధికార పార్టీని వీలయినంతగా రెచ్చగొట్టడమే తమ ఉద్దేశం అన్నట్లు తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలోనే అయ్యన్నపాత్రుడు అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి వీడియోను అప్లోడ్ చేశారు.

అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై దుమారం

అదికూడా అయ్యన్నపాత్రుడు వ్యాక్యలతో దుమారం రేగి జోగి రమేష్ చంద్రబాబు ఇంటి పైకి వెళ్ళిన తరువాతనే తెలుగుదేశం పార్టీ అయ్యన్నపాత్రుడుకు సంబంధించిన వీడియోను అధికారికంగా ప్రచారంలోకి తేవడం విశేషం. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు అనీల్, సుచరిత, వెల్లంపల్లి, కొడాలి నానిలపై అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు చింతకాయల అయ్యన్నపాత్రుడు. తప్పంతా వైసిపిదేనని టిడిపి ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలో అసలు అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఎంత దారుణంగా ఉన్నాయో కూడా ప్రజలు తెలుసుకోవలసి ఉంది. అప్పుడే నేతలపై ఒక అంచనాకు రావచ్చు.

దాదాపు పది నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో ప్రతి మాటకు ముందు వెనుక ముఖ్యమంత్రి, మంత్రులను ఉద్దేశించి ఆ నా కొడుకులు, ఈ నా కొడుకులు అంటూ అయ్యన్నపాత్రుడు దూషించారు. అంతటితో ఆగకుండా మహా అయితే ఏం పీకుతారు.. కేసులు పెడతారు.. నాలుగు రోజులు జైల్లో వేస్తారు.. అంతే కదా అంటూ చెబుతూ మరీ అయ్యన్నపాత్రుడు రెచ్చిపోయారు.

మూఢ విశ్వాసంతో సజీవంగా సమాధిలోకి.. మరి ఏం జరిగింది..?

టిఎంసి అంటే ఏంటో తెలియని వాడు జలవనరుల శాఖ మంత్రా అని ప్రశ్నించారు. సన్న బియ్యానికి, మామూలు బియ్యానికి తేడా తెలియని కొడాలి నాని పౌరసరఫరాల శాఖ మంత్రా అంటూ ఎద్దేవా చేశారు. గుడి వద్ద కొబ్బరిచిప్పలు అమ్ముకునే వాడు దేవాదాయ శాఖ మంత్రా అంటూ నోరు పారేసుకున్నారు. మహిళ అని కూడా చూడకుండా హోంమంత్రి సుచరిత పై అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు మరీ దారుణంగా ఉన్నాయి.

మహిళా అని కూడా చూడకుండా హోమంత్రిపై

కోడెల శివప్రసాద్ రావు కూడా హోంమంత్రిగా చేశారని.. ఎస్పి నా కొడుకులు కూడా వచ్చి సెల్యూట్ కొట్టేవారని.. ఇప్పటి హోంమంత్రిని సాధారణ పోలీస్ అయినా సెల్యూట్ చేస్తున్నారా అంటూ ఎద్దేవా చేశారు. ఇలాంటి హోంమంత్రి ఎందుకు, సంక నాకడానికా అంటూ అత్యంత దారుణమైన పదజాలాన్ని చింతకాయల అయ్యన్నపాత్రుడు వాడారు. హోంమంత్రికి సిగ్గు, లజ్జ ఉందా అంటూ మహిళ అని కూడా చూడకుండా ఆమెపై నోరు పారేసుకున్నారు చింతకాయల అయ్యన్నపాత్రుడు.

ముఖ్యమంత్రి పైనా అదే స్థాయిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఇంటింటికి వెళ్లి మల్లెపూలు అమ్ముకోవాలని, దానికి అధ్యక్షుడిగా అంబటి రాంబాబును నియమించాలంటూ వ్యాఖ్యానించారు చింతకాయల. తన వ్యాఖ్యలపై దుమారం రేగడం, కేసు కూడా నమోదు చేయడంతో.. చింతకాయల అయ్యన్నపాత్రుడు విశాఖలో నేడు స్పందించారు. చంద్రబాబు ఇంటి పై వైసీపీ దాడి దారుణం అంటూనే.. తానేమి ముఖ్యమంత్రి జగన్ ను తిట్టేలేదంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. చర్చిలో ఫాదర్లు ఓ మై సన్ అంటూ ఉంటారని.. తాను అదే పదాన్ని తెలుగులో వాడానంటూ వ్యాఖ్యానించారు.

ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు పెడుతున్నారా.. అయితే ఇది చదవండి !

మంత్రులు చేస్తున్న పనులను బట్టి వారి గురించి మాట్లాడానని, తన మాటల్లో తిట్లు ఎక్కడ ఉన్నాయో చెప్పాలి అంటూ ప్రశ్నించారు. మొత్తం మీద అధికారపక్షాన్ని టిడిపి ఒక పద్ధతి ప్రకారమే రెచ్చగొడుతోంది అన్నది చింతకాయల వ్యాఖ్యలు చూసినా, ఆ వ్యాఖ్యల వీడియోను వివాదం రేగిన తర్వాత కూడా టీడీపీ అధికారికంగా ప్రచారం చేయడం బట్టే అర్థమవుతోంది.

Leave a Comment