సిఐ నాయక్ పై దాడి.. నారా లోకేష్ పై హత్యాయత్నం కేసు

సిఐ నాయక్ పై దాడి నేపథ్యంలో నారా లోకేష్ పై హత్యాయత్నం కేసు నమోదు అయింది. A1 గా నారా లోకేష్ ను చేర్చారు. A2 గా ఎమ్మెల్సీ అశోక్ బాబు, A3 గా ఆలపాటి రాజా, A4 గా టిడిపి నేత శ్రవణ్ కుమార్ పేర్లను చేర్చారు. నిన్న గొడవ జరిగిన సమయంలో సిఐ నాయక్ పై టిడిపి కార్యాలయం వద్ద వీరంతా దాడి చేశారన్నది అభియోగం.

టిడిపి కార్యాలయం వద్దకు వచ్చిన సీఐ నాయక్ ను టిడిపి నేతలు దాడి చేసి పట్టుకున్నారు. సిఐ నాయక్ కూడా కార్యాలయంపై దాడి చేశారంటూ అతడిని బలవంతంగా టిడిపి కార్యాలయంలోనే ప్రెస్ ముందుకు తీసుకొచ్చారు టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు. తాను పోలీసునని చెప్పినా ఆయన పై టిడిపి నేతలు, కార్యకర్తలు దాడి చేశారు.

సిఐ నాయక్ పై దాడి చేసింది నిజమే.. అశోక్ బాబు

తమ వాళ్ళు నాయక్ పై దాడి చేసింది నిజమేనని.. తామే ఆపామని అశోక్ బాబు కూడా చెప్పారు. పరిస్థితిని తెలుసుకునేందుకు అక్కడికి వెళ్ళిన సమయంలో సిఐ నాయక్ ను టిడిపి నేతలు కొట్టారు. అంతటితో ఆగకుండా బలవంతంగా మీడియా ముందు టిడిపి నేతలు ప్రవేశపెట్టడాన్ని పోలీసు శాఖ తీవ్రంగా తీసుకుంది. ( జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోసం చంద్రబాబు )

తాను పోలీసునని, ఐడి కార్డు పోయిందని సిఐ నాయక్ చెప్పినా టిడిపి కార్యకర్తలు, నేతలు పట్టించుకోకుండా అతనిపై దాడి చేశారు. అనంతరం సిఐ నాయక్ వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తానూ సీఐ నని.. గొడవ జరుగుతున్న విషయం తెలిసి వచ్చానని.. ఐడి కార్డు పోయింది అని చెప్పినా సరే తనను టీడీపీ నేతలు కొట్టారని.. అంతటితో ఆగకుండా తనను అవమానకరంగా మీడియా ముందు ప్రవేశ పెట్టారని ఫిర్యాదు చేశారు. మాస్క్ కూడా తీయించి తనను నేరస్తుడి తరహాలో మీడియా ముందు ప్రవేశ పెట్టారని ఫిర్యాదులో వివరించారు. దాంతో నారా లోకేష్ తో పాటు టిడిపి నేతలపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద కేసు నమోదు చేశారు.

Leave a Comment