ఏపీ టీడీపీ కొత్త రథసారధిగా అచ్చెన్నాయుడు..?

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ కొత్త రథసారిధి ఎంపిక పూర్తయింది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా కళా వెంకట్రావు స్థానంలో మరో కీలక నేతను నియమించేందుకు పార్టీ అధినేత దృష్టి సారించారని తెలుస్తోంది. ఈ మేరకు కొత్త కమిటీపై కసరత్తు పూర్తి అయినట్లు సమాచారం.

కళా వెంకట్రాయవు స్థానంలో.. టీడీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు కి అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం సిద్ధమైనట్టు పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై టీడీటీ తరపున తన గళాన్ని గట్టిగా వినిపిస్తున్న అచ్చెన్నాయుడుకే పార్టీ పగ్గాలు అప్పగించాలని అధినేత చంద్రబాబు నాయుడి ఆలోచనగా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనికి అనుగుణంగా ఈ నెల 27న ఏపీ టీడీపీ పార్టీ కొత్త కమిటీని అధికారికంగా ప్రకటించనుంది.

కానీ ఇప్పటికే ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లి 70 రోజుల తర్వాత బెయిల్ పై విడుదల అయ్యారు. అప్పటినుంచీ తనను అక్రమంగా ఇరికించారంటూ ప్రభుత్వంపై పోరాడుతున్నారు.

అయితే.. ప్రస్తుతం ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు కొనసాగుతున్నాడు. అయితే ఆ స్థానంలో మళ్లీ బీసీకే పట్టం కట్టేందుకు టీడీపీ అధిష్టానం మరో ఆలోచనగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే పార్లమెంట్ పార్టీ కొత్త కమిటీలను నియమిస్తున్న టీడీపీ అధిష్టానం.. వైఎస్సార్ సీపీకి ఎదురు నిలబడే వ్యక్తిని రథసారధిగా నియమించాలని భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ ని ఎదుర్కొనేందుకు చంద్రబాబు నాయుడు గట్టిగానే వ్యూహరచనలు చేస్తున్నారు.

Leave a Comment