ఇక సభలో అచ్చెన్నాయుడు అధ్యక్షా అనేది ఎప్పుడో.. !!

టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు విషయంలో ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. వీరిద్దరిపైనా కఠినంగా వ్యవహరించాలని అసెంబ్లీ స్పీకర్ కు ప్రివిలేజ్ కమిటీ ప్రతిపాదించింది. ఇకపై అసెంబ్లీలో రెండున్నరేళ్ల పాటు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులకు మైకు ఇవ్వకూడదు అని ప్రివిలేజ్ కమిటీ ప్రతిపాదించింది. ఈ నివేదికను అసెంబ్లీ స్పీకర్ కు అందజేసి, సభలో దానిని అనుమతించి.. సభ ద్వారా దానిని అమలు చేయాలని కమిటీ ప్రతిపాదించింది.

అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులకు ఇక మైక్ కట్

అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు వీరిద్దరూ సభను తప్పుదోవ పట్టించడంతో పాటు.. సభా నాయకుడిని దుర్భాషలాడినందుకు వీరి ఇద్దరి పైన చర్యలు తీసుకోవాలని ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేసింది. రెండున్నరేళ్ల పాటు మైక్ ఇవ్వకపోవడం అంటే.. ఇక ఈ ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ముగిసే వరకు కూడా అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో మైకు దొరికే అవకాశమే వుండదు.

నిమ్మల రామానాయుడుపై వున్న ప్రధాన అభియోగం.. ఆయన పింఛన్ల విషయంలో సభను తప్పుదోవ పట్టించే లెక్కలు చెప్పారంటూ ఆ రోజు చర్చ సందర్భంగా నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన పైన సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టారు. నిమ్మల రామానాయుడు అబద్ధాలు చెప్పింది.. తప్పు చేసింది నిజమని ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీ తెచ్చింది.

అయితే అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు పై చర్యలకు ప్రివిలేజ్ కమిటీ చేసిన సిఫార్సులను ఈ కమిటీలోనే మెంబర్ గా ఉన్న టిడిపి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆరోజు చర్చ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి రామానాయుడు ఉద్దేశించి డ్రామా నాయుడు అని అన్నారు. అందుకు కౌంటర్ గానే రామానాయుడు తిరిగి జగన్మోహన్రెడ్డిని జైలు రెడ్డి అన్నారు. ఈ మాత్రం దానికే వారి పైన రెండున్నరేళ్ల పాటు మైక్ కట్ చేయాలనే నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు అని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వాదించారు. ( నారా లోకేష్ పాదయాత్ర.. నాయకుడిగా సక్సెస్ అవుతాడా.. ? )

వారికి రెండున్నరేళ్ల పాటు మైక్ ఇవ్వకూడదు అంటూ తొలుత ప్రివిలేజ్ కమిటీ సభ్యుడు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రతిపాదించారు. దానిని మరో వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సమర్ధించారు. దాంతో ప్రివిలేజ్ కమిటీ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. మద్యం షాపుల విషయంలో సభను తప్పుదోవ పట్టించేలా తప్పుడు లెక్కలు చెప్పారు అన్నది అచ్చెన్నాయుడుపైన ఉన్న అభియోగం. దీనిపై శ్రీకాంత్ రెడ్డి అచ్చెన్నాయుడుపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆయన కూడా తప్పు చేసినట్లు ప్రివిలేజ్ కమిటీ కూడా నిర్ధారించింది. ( రంగంలోకి దిగిన వైఎస్ జగన్ )

ప్రస్తుతం అసెంబ్లీలో టీడీపీ తరఫున కాస్త గట్టిగా మాట్లాడే వారిలో అచ్చెన్నాయుడు, రామానాయుడు ఉంటూ వచ్చారు. వీరిద్దరికీ రెండున్నరేళ్ల పాటు అంటే ఈ శాసనసభ కాలం ముగిసే వరకు మైక్ ఇవ్వక పోవడం అన్నది తెలుగుదేశం పార్టీకి ఒక విధంగా ఇబ్బందికరమైన పరిణామంగానే చెప్పవచ్చు.

1 thought on “ఇక సభలో అచ్చెన్నాయుడు అధ్యక్షా అనేది ఎప్పుడో.. !!”

Leave a Comment