ఈ అవార్డులు మాపై భాద్యతను పెంచాయి : ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ : ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలు ప్రభుత్వాని కంటే కూడా పోలీసులను ఎక్కువ టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తున్నారు. ఏకంగా టిడిపి నిన్న దిశ పోలీస్ స్టేషన్ లను ముట్టడి చేయడం.. ఆందోళనలకు పిలుపు ఇవ్వడం.. ఇదంతా కూడా దిశ యాప్ మీద వ్యతిరేక ప్రచారం జరిగి, తద్వారా దానిని ఎవరూ డౌన్ లోడ్ చేసుకోకుండా.. పోలీసు రక్షణకు దూరమై.. దానివల్ల ఏమైనా జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు. అవకాశం ఉన్నప్పుడు యాప్ ను ఉపయోగించుకోవాలి కదా.

మేము గర్వపడే రోజు ఈ రోజు అన్న గౌతమ్ సవాంగ్

అయితే ప్రతిపక్షాలు పోలీసులను టార్గెట్ చేసుకుని ఎంత విమర్శలు చేస్తున్నా కూడా జాతీయ స్థాయిలో అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు మంచి గుర్తింపే దక్కుతోంది. తాజాగా ఈ రోజు కూడా జాతీయస్థాయిలో టెక్నాలజీకి సంబంధించి ఐదు అవార్డులు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు దక్కాయి. ఈ విషయాన్ని గౌరవ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ఆనందంగా ప్రకటించుకుంటూ.. ” ఏపీ పోలీసులు గర్వంతో తలెత్తు కోవలసిన రోజు ఇది. పోలీసు శాఖలో టెక్నాలజీకి సంబంధించి ఐదు అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులు ఏపీ పోలీసుల బాధ్యతను పెంచి, మరింత మెరుగ్గా ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తాయి” అని మాట్లాడారు.

అలాగే ‘పోలీస్ శాఖలో ఉన్నటువంటి సిబ్బంది ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను మొత్తంగా డిజిటల్ హెల్త్ అనే ఒక యాప్ లో మెయింటెన్ చేస్తూ వున్నాము. దీనికి కూడా జాతీయ స్థాయిలో ఒక అవార్డు వచ్చింది. అదే సమయంలోనే పాస్ పోర్ట్ సేవకు సంబంధించి కూడా జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు ఆంధ్రప్రదేశ్ కు దక్కింది. పాస్ పోర్ట్ వెరిఫికేషన్ టెక్నాలజీ సాయంతో చాలా పారదర్శకంగా.. వేగంగా సేవలను అందిస్తుందని కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులను ప్రశంసించిందంటూ డిజిపి గౌతమ్ సవాంగ్ గారు మాట్లాదారు. ( Vehicle Scrappage Policy  )

దానికి కొనసాగింపుగానే దిశా మహిళల రక్షణకు సంబంధించి కూడా ఇంతకు ముందే జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు దిశ యాప్ కు సంబంధించిన అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత.. ఇప్పటికే 47 లక్షల మంది దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. దిశా యాప్ నుండి రోజుకు 4 వేల కాల్స్ వస్తున్నాయి. వీటన్నిటిని చాలా చిత్తశుద్ధితో పరిశీలిస్తూ వాటిపై స్పందిస్తూ వున్నాము. మహిళల రక్షణకు మేము కట్టుబడి ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకుంటుంది” అని చెప్పి గౌతమ్ సవాంగ్ గారు మాట్లాడారు.

మరో వైపు ప్రతిపక్షాల విమర్శలపై స్పందిస్తూ.. “ఈ రెండు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు 130 అవార్డులు వచ్చాయి. దేశంలో ప్రెస్టీజియస్ అవార్డులు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులను విమర్శించడమే పనిగా ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయి” అంటూ మాట్లాడారు. ఏది ఏమైనా ఈవిధంగా కేంద్రంలో గుర్తింపు లభించి.. ఇటువంటి అవార్డులు పోలీసులు రావడంతో పోలీసులపై బాధ్యత పెరిగి, మరింతగా ప్రజలకు మెరుగైన సేవలు చేస్తే ఎవరికైనా ఆనందమే కదా..

Leave a Comment