సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, డీజీపీని, పోలీసు వ్యవస్థను అగౌరవపరిచే విధంగా మాట్లాడిన విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు పై కేసు నమోదు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం అనంతపురం నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా న్యాయవాది ఇస్తాఖ్ అహ్మద్ మాట్లాడుతూ.. చంద్రబాబు చేపట్టిన దీక్షలో పాల్గొన్న బోండా ఉమా బాబు సమక్షంలోనే టిడిపి కార్యకర్తలను రెచ్చగొట్టేలా సీఎం జగన్ ను అగౌర పరిచేలా మాట్లాడారన్నారు. గొడవలు సృష్టించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. పైగా ఆ ప్రసంగాన్ని టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని తెలిపారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలు
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదిక
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలు
మా నాయకుడు చిటికేస్తే మీ డిజిపి, మీ పోలీసులు ఎంత మంది ఉన్నా.. తాడేపల్లి మీద దాడి చేసి ఒక గంటలో ధ్వంసం చేస్తామంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా.. అక్కడే ఉన్న చంద్రబాబు గానీ, ఇతర నాయకులు గానీ నివారించే ప్రయత్నం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బోండా పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ( ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి.. చంద్రబాబు డిమాండ్ )
మరోవైపు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాను అరెస్ట్ చేయాలంటూ అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో గుంటూరు నగర మేయర్ నాగ మనోహర్ నాయుడు ఫిర్యాదు చేశారు. సీఎంను ధూషించడమే కాకుండా.. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేస్తామంటూ సవాల్ విసిరి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న బోండా ఉమను వెంటనే అరెస్టు చేయాలని ఆయన కోరారు. దీంతో టీడీపీ నేత బోండా ఉమ చిక్కుల్లో పడినట్లే కనిపిస్తోంది. అయితే బోండా ఉమా వ్యాఖ్యలపై పోలీసులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
1 thought on “బోండా ఉమాపై అందుకే కేసు నమోదు చేయలేదేమో.. !”