ఏపీ కొత్త సీఎస్ గా సమీర్ శర్మ .. ఆదిత్యానాథ్ దాస్ కు మరో కీలక పదవి ?

ఏపీ ప్రభుత్వం కొత్త సీఎస్ ఎంపికను పూర్తి చేసింది. సెప్టెంబర్ 30తో ప్రస్తుత సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ పదవీకాలం ముగుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్త సీఎస్ నియామకం జరిగింది. కొత్త సీఎస్ గా ఎవరిని నియమించాలనే దానిపై పలువురి పేర్లను పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ వైపు మొగ్గు చూపారు. ఆయన్ను తదుపరి సీఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 1 నుంచి సమీర్ శర్మ కొత్త సీఎస్ గా బాధ్యతలు స్వీకరిస్తారు.

కేంద్ర సర్వీస్ లో ఉన్న సమీర్ శర్మ ఇటీవలే రాష్ట్రానికి తిరిగి వచ్చారు. కేంద్ర సర్వీసుల్లో నుంచి రాగానే ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయనను ప్రభుత్వం నియమించింది. ఇటీవల ఆర్థిక వ్యవహారాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ ఆయన పాల్గొంటున్నారు. దాంతో ఆయన్ను తదుపరి సీఎస్ గా నియమించేందుకే ఈ రాష్ట్రానికి రప్పించారన్న ప్రచారం జరిగింది. దాన్ని నిజం చేస్తూ 1985 బ్యాచ్ ఐఏఎస్ కు చెందిన సమీర్ శర్మను సీఎస్ గా ఏపీ ప్రభుత్వం నియమించింది.

స్మార్ట్ ఫోన్.. అంత స్మార్ట్ కాదేమో ..?

సమీర్ శర్మ పదవీ కాలం నవంబర్ తో ముగుస్తుంది. అయితే ఆయన పదవీ కాలాన్ని మరో మూడు నెలలు లేదా ఆరు నెలల పాటు తొలగించేలా కేంద్ర ప్రభుత్వంను రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది.

ఆదిత్యానాథ్ దాస్ కు మరో కీలకమైన బాధ్యత

ప్రస్తుతమున్న ఆదిత్యనాథ్ పదవీకాలం ఇదివరకే మూడు నెలల పాటు ప్రభుత్వం పొడిగించింది. ఈ నెలాఖరులో పదవీ విరమణ చేస్తున్న ఆదిత్యనాథ్ సేవలను ప్రభుత్వం మరో రూపంలో వినియోగించుకునేందుకు సిద్దపడింది. ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేస్తున్న ఆదిత్యనాథ్ దాస్ కు అక్టోబర్ ఫస్ట్ నుండి జగన్మోహన్ రెడ్డి గారు తనకు మరో కీలకమైన బాధ్యతలు అప్పజెప్పడం అయితే దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది.

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం

దీనికి కారణాలు కూడా లేకపోలేదు. ఆదిత్యనాథ్ దాస్ గారికి ఉన్నటువంటి విశేష అనుభవం, వైఎస్ ఫ్యామిలీకి కొంచెం దగ్గరగా ఉండే మనిషి, వీటన్నిటికీ మించి ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు మధ్య నెలకొన్న నీటి వివాదాలు, దాని నేపథ్యం, దాని పరిష్కారం, వీటన్నిటి మీద కూడా విశేషమైన అనుభవం ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన వ్యక్తి ఆదిత్యనాథ్ దాస్. ఇప్పటికే ఇటువంటి నీటి వివాదాలు ఉన్నాయి కాబట్టి.. ఈ నీటి అంశాలకు సంబంధించి చాలా ఎక్కువ అనుభవం వున్న ఆదిత్యనాథ్ దాస్ గారిని ఇప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దూరం చేసుకోవడానికి ఇష్టపడడు.

అదే సమయంలోనే వీటిపై ఇంత అనుభవం వుండి, ఇటువంటి కీలకమైన సమయంలో పని చేయాలని తన అభిప్రాయం ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్నా నేపథ్యంలో అక్టోబర్ ఫస్ట్ నుండి ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారిని జలవనరుల శాఖ ప్రధాన సలహాదారుగా మరో కొత్త భాద్యతలు స్వీకరించబోతున్నారనేది దాదాపు కంఫర్మ్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి.

Leave a Comment