మంత్రి పేర్ని నాని పై దాడి చేసిన వ్యక్తి టిడిపి సానుభూతిపరుడుగా నిర్ధారణ అయింది. మచిలీపట్నంలోని మంత్రి పేర్ని నాని నివాసం వద్దే బడుగు నాగేశ్వరరావు అనే వ్యక్తి దాడికి ప్రయత్నించారు.
తన తల్లి పెద్దకర్మ కార్యక్రమం సందర్భంగా కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి తన నివాసం నుంచి బయటకు వస్తున్న సమయంలో నాగేశ్వరరావు కాళ్లకు దండం పెట్టేందుకు వచ్చినట్లుగా వచ్చి పదునైన తాపీ తో మంత్రిని పొడవబోయాడు.
తొలిసారి పొడవగా తాపీ వెళ్లి మంత్రి నడుముకు ఉన్న బెల్ట్ కు తగిలింది. తొలి ప్రయత్నంలో బెల్టు అడ్డు రావడంతో పేర్ని నానికి హాని జరగలేదు. తొలి ప్రయత్నం విఫలం కావడంతో రెండోసారి మంత్రి పొట్టలో పొడిచేందుకు నాగేశ్వరరావు ప్రయత్నించగా అంతలోపే మంత్రి అనుచరులు అప్రమత్తమయ్యారు.
అక్కడున్న వారు నాగేశ్వరరావును వెనక్కి తోసేశారు. వెంటనే పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నాగేశ్వరావు టిడిపి సానుభూతి పరుడు అని, నాగేశ్వరావు సోదరి ఉమాదేవి టిడిపి మండల నాయకురాలిగా పని చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.
పూజ ముగించుకుని భోజన కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు వెళ్తున్న సమయంలో నాగేశ్వరరావు దాడి చేశారని మంత్రి పేర్ని నాని వివరించారు. నాగేశ్వరావు కుటుంబం టిడిపిలో ఉందని తనకు తెలుసన్నారు. ఎన్నికల సమయంలో టిడిపి తరఫున ప్రచారం కూడా నాగేశ్వరరావు చేస్తున్నారని మంత్రి వివరించారు.
ఉదయం నుంచే తన ఇంటి వద్ద మకాం వేసినట్లు నాగేశ్వరరావును చూసిన వారు చెబుతున్నారు అని మంత్రి వెల్లడించారు. ఇలా ఎందుకు దాడి చేశారో అర్థం కావడం లేదన్నారు. ఎవరి ప్రమేయం ఏమైనా ఉందా లేదా అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు.
తనకు ఎలాంటి ముప్పు లేదని భావించి పెద్దగా భద్రత కూడా లేకుండా తాను తిరుగుతూ ఉంటానని మంత్రి వివరించారు. అనవసరమనుకొని ఇంటివద్ద స్కానర్ కూడా ఏర్పాటు చేయలేదన్నారు. గతంలో తన అనుచరుడు మోకా భాస్కర్ రావు కూడా ఎలాంటి ముప్పు లేదని ఒంటరిగా తిరగడం గమనించే హత్య చేసారని పేర్ని నాని వివరించారు.
తాను ఎవరికీ ఇప్పటివరకు హాని చేయలేదని.. తనకు శత్రువులు ఎవరూ లేరని.. కాబట్టి తనకు భద్రత పెంచాల్సిన అవసరం కూడా లేదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. నాగేశ్వరావు దాడి సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
దాడి వెనక ఎవరి ప్రమేయం ఏమైనా ఉందా లేదా అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఈ విషయం తెలియగానే మంత్రి కొడాలి నాని, పలువురు వైసిపి ఎమ్మెల్యేలు, నేతలు కార్యకర్తలు పేర్ని నాని నివాసానికి వెళ్లి పరామర్శించారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …