నిమ్మగడ్డకు హైకోర్టులో గట్టి షాక్ ..!

ఏపీలో పంచాయతీ ఎన్నికల కేంద్రంగా వైసీపీ సర్కార్ కు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మధ్య సాగుతున్న పోరులో తెరపైకి వచ్చిన ఈవాచ్ యాప్ కు భంగపాటు తప్పలేదు.

ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న ఈ యాప్ ను తీసుకొచ్చిన నిమ్మగడ్డకు హైకోర్టులో చుక్కెదురైంది. ఏపీలో పంచాయతీ ఎన్నికలలో అక్రమాలను గుర్తించేందుకు ఫిర్యాదుల కోసం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ వాచ్ యాప్ ను ప్రారంభించారు.

అయితే ప్రభుత్వం వివిధ కారణాలతో దీనిని వ్యతిరేకించింది. ప్రభుత్వం ఇప్పటికే నిఘా కోసం రెండు యాప్ లు పనిచేస్తున్నాయని, అందుకే ఈ కొత్త యాప్ అవసరం లేదని వాదించింది. అయినా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వినకపోవడంతో ప్రభుత్వం దీనిపై హైకోర్టును ఆశ్రయించింది.

విచారణ జరిపిన హైకోర్టు ఈవాచ్ యాప్ కు అనుమతి నిరాకరించింది. ఎస్ఈసీ తీసుకొచ్చిన ఈవాచ్ యాప్ కు భద్రత అనుమతులు తీసుకోకపోవడంతో, వాటి కోసం దరఖాస్తు చేసినా ఆలస్యం అవుతూ ఉండటం వంటి కారణాలతో యాప్ కు చుక్కెదురైంది. ఈ యాప్ ను గుర్తించేందుకు హైకోర్టు నిరాకరించింది.

దీంతో ఇప్పటికే ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నిఘా యాప్ తోపాటు సి క్యాప్ యాప్ ను వాడుకుంటామని ఎస్ఈసీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు ఈ యాప్ పై తదుపరి విచారణను ఈ నెల 17 కు వాయిదా వేసింది.

Leave a Comment