నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఏపీ హైకోర్టు ప్రశ్నల వర్షంతో ఉక్కిరి బిక్కిరి చేసింది. ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అయిన దానికి.. కాని దానికి ఎంపీ రఘురామ కోర్టు మెట్లు ఎక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ( హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కన్నెగంటి లలిత బదిలీ )
తాజాగా అమూల్ డైరీ విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించి అభాసు పాలయ్యారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆస్తులను లీజ్ పద్ధతిలో అమూల్ కు బదిలీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రవీణ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదిక
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలు
- కుప్పం మున్సిపాలిటీలో Ex-Officio సభ్యునిగా దరఖాస్తు.. బాబు పరిస్థితి ఇలా అయ్యిందేంటి..?
- పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నప్పుడు ఏమైపోయారు బాబు గారు ..?
- ఇరు పార్టీలు సంయమనం పాటించండి.. లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ
ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పిటిషనర్కు కీలక ప్రశ్నలు వేసింది. మీకేంటి నష్టమంటూ నిలదీసింది. ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఆస్తులను గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ కు లీజుకిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి..? అమూల్ విషయంలో ప్రభుత్వ నిర్ణయం వల్ల మీరు ఏ విధంగా నష్టపోతారో చెప్పండి..? పలానా విధంగానే ప్రభుత్వం వ్యవహరించాలని ఎలా శాసిస్తారు.? ఎవరితో ఒప్పందం చేసుకోవాలో అది ప్రభుత్వం ఇష్టం.
వ్యక్తులు, రాజకీయ పార్టీలు ఆధారంగా న్యాయస్థానాలు వ్యాజ్యాలు పరిష్కరించవు. కోర్టు ముందున్న దస్త్రాలు, వివరాలు ఆధారంగా రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన జరిగిందో లేదో మాత్రమే పరిశీలిస్తాం అని స్పష్టం చేసింది.
వైయస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి పిటిషన్ వేసినా తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావించి ఇష్టానుసారం వ్యవహరిస్తున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ధర్మాసనం వ్యాఖ్యలు చెంపపెట్టులాంటిది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ బెయిల్ రద్దుకు సంభందించిన విషయంలోనే మీకేంటి నష్టం అని ప్రశ్నించివుంటే ఎంపీ రఘురామ కృష్ణంరాజు పునరాలోచనలో పడి ఉండేవారని న్యాయ వర్గాలు అంటున్నాయి.
1 thought on “ఎంపీ రఘురామ కృష్ణంరాజు గారు.. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి.. ? ఏపీ హైకోర్టు”