నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఇస్తున్న మందుల్లో ఒకటైన K Medicine కి ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. గతంలో ఆనందయ్య ఇంతర మందులకు హైకోర్టు ఆదేశాలతో అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. కంటిలో వేసే చుక్కల మందులకు అనుమతించలేదు. ఆయుష్ నివేదికకు సంబంధించి పూర్తి వివరాలు రాని నేపథ్యంలో కంటి ముందుకు అనుమతి ఇవ్వలేదు.
ఈ నేపథ్యంలో దీనిపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. కరోనా బాధితులకు తక్షణమే K Medicine పంపిణీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఆనందయ్య పసరు ముందుకు పర్మిషన్ ఇచ్చిన కోర్టు.. కంటి చుక్కల ముందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మరోవైపు ఆనందయ్య ముందు పంపిణీ ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో పసరు మందు పంపిణీ ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గ్రామ, వార్డు వాలంటీర్ ల ద్వారా ఇంటింటికి పంపిణీ మొదలుపెట్టారు.
కరోనా వ్యాధి సోకిన వారికి ముందుగా మందు ఇవ్వాలని నిర్ణయించారు. మూడు రోజులపాటు ఇంటింటికి ఆనందయ్య మందు పంపిణీ చేయనున్నారు. అయితే ప్రస్తుతానికి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మాత్రమే ఆనందం ముందు తయారు చేశారు. దాదాపు లక్షన్నర మందికి మూడు రకాలైన మందులు తయారు చేసినట్లు తెలుస్తోంది.
ఈ లెక్కన ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే మందు పంపిణీకి దాదాపు వారం నుంచి పది రోజులు పైనే పడుతుంది. మరోవైపు అటు చంద్రగిరి నియోజకవర్గంలో ఆనందయ్య కుమారుడు శ్రీధర్ మందు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే శేషాచలం అడవుల్లో నుండి పెద్దఎత్తున వనమూలికలు తెప్పించారు. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రోజుకు రెండు టన్నుల మందు తయారీ లక్ష్యంగా పని చేస్తున్నారు.
పని ప్రారంభమైన నాలుగైదు రోజులైనప్పటికీ ఇవాళ్టితో మందు తయారీ పూర్తవుతుందని చెప్పారు. అయితే వాటిని గుళికలుగా మార్చి పంపిణీకి సిద్ధం చేయడానికి మరో రెండు రోజులైనా పడుతుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. దీంతో బుధవారం లేదా గురువారం నుండి చంద్రగిరి నియోజకవర్గంలో ముందు పంపిణీ జరగవచ్చని అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేస్తున్నారని తెలుస్తోంది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …