ఎస్ ఈసీ నీలం సాహ్ని : ఎంపిటిసి, జెడ్ పిటిసి ఎన్నికల కౌంటింగ్ కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గురువారం రాత్రి కౌంటింగ్ తేదీని ప్రకటించారు. ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా పరిషత్ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుందని నోటిఫికేషన్లో వెల్లడించారు. అటు పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.
సుప్రీంకోర్టు తీర్పును సరిగా అర్థం చేసుకోలేకపోయారు అంటూ నీలం సాహ్ని ఇంగ్లీష్ పరిజ్ఞానంపై సింగల్ బెంచ్ న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను ప్రధాన న్యాయమూర్తి గోస్వామి ఆక్షేపించారు. నీలం సాహ్నిని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయడం అనవసరం అని తన తీర్పులో వెల్లడించారు. తాము ఇప్పుడు సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేస్తున్నందున ఆ తీర్పులోని వ్యాఖ్యలకు అంత ప్రాధాన్యత ఉందని వ్యాఖ్యానించారు. ( సోనూసూద్ ఇంటిపై ఇన్కమ్ టాక్స్ దాడులు.. అందుకేనా.. ! )
సింగిల్ జడ్జి తనపై చేసిన వ్యాఖ్యలను తీర్పు నుంచి తొలగించాలంటూ నీలం సాహ్ని చేసిన అప్పీల్ ను అనుమతిస్తున్నట్లు సీజే ప్రకటించారు. నీలం సాహ్ని ఏప్రిల్ 1న విడుదల చేసిన నోటిఫికేషన్ వల్ల కొందరు అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందన్న వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఏప్రిల్ 1న ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం పోటీలో ఉన్న అభ్యర్థుల అందరికీ సమాన అవకాశాలు, సమాన సమయం దొరుకుతున్నప్పుడు.. కొందరికి మాత్రమే అన్యాయం జరుగుతుందని అనడం అర్థం లేనిదని ధర్మాసనం అభిప్రాయపడింది.
- దేశం మొత్తానికి గంజాయి సరఫరా చేసిన క్రెడిట్ మాదే.. గంటా శ్రీనివాస్
- బోండా ఉమాపై అందుకే కేసు నమోదు చేయలేదేమో.. !
- సిఐ నాయక్ పై దాడి.. నారా లోకేష్ పై హత్యాయత్నం కేసు
- జనసేన పార్టీ అధ్యక్షుడిని వెంటాడుతున్న నవతరం పార్టీ
- పోలీసుల ఎంట్రీతో నీళ్లునమిలిన నక్కా ఆనందబాబు..!
ఏప్రిల్ 1న ఇచ్చిన నోటిఫికేషన్ ను నిలుపుదల చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పు ఇవ్వడంతో ఎస్ ఈసీ నీలం సాహ్ని హైకోర్టులో అప్పీల్ చేశారు. అలా అప్పీల్ చేయడానికి కూడా పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చే సమయంలో సింగల్ జడ్జి తప్పుబట్టారు. ఈ విషయాన్ని కూడా సీజే నేతృత్వంలోని ధర్మాసనం ప్రస్తావిస్తూ సింగిల్ జడ్జి తీర్పును ఆక్షేపించింది. ( మా నివేదికను బయటపెట్టండి.. సుప్రీమ్ కోర్ట్ ప్యానెల్ మెంబెర్ Anil J Ghanwat )
చట్టబద్దంగా ఎస్ ఈసీ కి సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ ముందు అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు.. దాన్ని కూడా విమర్శించడం సరైనది కాదని సీజే నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. నాలుగు వారాల కోడ్ అమలు పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం స్పష్టత ఇచ్చింది.
స్థానిక సంస్థల ఎన్నికలకు నాలుగు వారాల పాటు కోడ్ విధించాలని సుప్రీంకోర్టు చెప్పింది కానీ.. ప్రతి ఎన్నికకు నాలుగు వారాల పాటు కోడ్ అమలు చేయాలని ఎక్కడా చెప్పలేదు అని స్పష్టం చేసింది. నాలుగు వారాల కోడ్ ను పంచాయతీ ఎన్నికల నుంచే అమలు చేయడం మొదలైందని.. ఆ విధంగా చూస్తే సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించినట్టే అవుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. ( గుజరాత్ లో బీజేపీ పట్టుకోల్పోతోందా .. ? )
జనసేన నేత వేసిన పిటిషన్ లో ఎక్కడ కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘన గురించి ప్రస్తావించలేదని.. అయినా సరే సింగిల్ జడ్జి మాత్రం తన తీర్పులో నాలుగు వారాలు కోడ్ అమలు చేయకపోవడం వల్ల పోటీ చేసే అభ్యర్థులకు నష్టం కలిగినట్టు జనసేన నేత నిరూపించారు అంటూ తీర్పులో రాసారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఎత్తిచూపారు. పిటిషనర్లు లేవనెత్తని అభ్యంతరాలను తీర్పులో ప్రస్తావించారు అని తప్పుబట్టారు. పై అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేయడంతో పాటు, ఎన్నికల కౌంటింగ్ కు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.