ఏపీలో బార్లకు గ్రీన్ సిగ్నల్ ..

దేశంలో కరోనా లాక్ డౌన్ మొదలుతో అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. స్కూల్స్, హోటల్స్ మరియు మాల్స్ అన్నీ మూతపడ్డాయి. ప్రభుత్వానికి ఆదాయమార్గంగా వుండే మద్యం అమ్మకాలపై మరించ తీవ్ర ప్రభావం చూపాయని చెప్పవచ్చు.

మన తెలుగు రాష్ట్రమైన ఏపీ లో కరోనా కారణంగా మార్చి 22 నుండి బార్లలో మద్యం అమ్మకాలు నిలిపివేశారు. దేశంలో విడతల వారీగా అమలుచేస్తున్న అన్ లాక్ లో భాగంగా ఏపీలో మద్యం అమ్మకాలు వైన్స్ కి మాత్రమే పరిమితం చేశాయి. అయితే నేటి నుంచి బార్లకు కూడా అనుమతులు జారీ చేస్తూ మద్యం విక్రయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ( పేటీఎం సేవలు… )

బార్ల లైసెన్స్ లపై 20% కోవిడ్ ఫీజు వసూలు చేయనున్నట్లు తెలిపారు. మరియు 10% అడిషనల్ రిటైల్ టాక్స్ ఫీజు కూడా విధించారు. ప్రస్తుతం ఏపీలో వున్నా బార్ల లైసెన్స్ ని 2021 జున్ 31 వరకు పొడిగిస్తూ జీవో జారీ చేశారు.

Leave a Comment