ఇవేనా జగన్మోహన్ రెడ్డికి మీరిచ్చే సలహాలు : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఎవరు ఇస్తున్నారో గాని.. వాళ్లు నిజంగానే జగన్మోహన్ రెడ్డికి మంచి చేయాలనుకుంటున్నారా.. లేకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల్లో చులకన చేయాలనుకుంటున్నారా అన్నది అర్థం కాని పరిస్థితి. ప్రభుత్వంలో పారదర్శకత ఉండాలి అని కోరుకునే వారు ఎవరూ సమర్ధించ లేని ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఏంటంటే ప్రభుత్వ జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచకుండా.. ఆన్లైన్ వెబ్సైట్లో పెట్టకుండా దాన్ని పూర్తిగా మాయం చేయాలి అని నిర్ణయం తీసుకోవడమే. ఇటువంటి నిర్ణయాన్ని ఎవరూ కూడా సమర్ధించలేని పరిస్థితి ఇప్పుడు నెలకొంది.
అసలు ఈ ప్రభుత్వంలో ఎవరు ఇటువంటి సలహా ఇచ్చారు.. దీనివల్ల ఏంటి ఉపయోగం.. ఈ నిర్ణయాన్ని అమలు చేసే శక్తి సామర్థ్యం ప్రభుత్వానికి ఉందా అని వీళ్ళు ఆలోచించారా లేదా అన్నది కూడా అనుమానమే. ఈ విషయంపై తప్పనిసరిగా ఎవరో ఒకరు హైకోర్టుకు వెళ్తారు. ఇప్పటికే కోర్టులు కూడా ప్రభుత్వం మీద ఓకే అభిప్రాయంతో ఉన్నాయి. తప్పనిసరిగా హై కోర్టులో అయితే ఎదురుదెబ్బ తగులుతుంది.
- దేశం మొత్తానికి గంజాయి సరఫరా చేసిన క్రెడిట్ మాదే.. గంటా శ్రీనివాస్
- బోండా ఉమాపై అందుకే కేసు నమోదు చేయలేదేమో.. !
- సిఐ నాయక్ పై దాడి.. నారా లోకేష్ పై హత్యాయత్నం కేసు
- జనసేన పార్టీ అధ్యక్షుడిని వెంటాడుతున్న నవతరం పార్టీ
- పోలీసుల ఎంట్రీతో నీళ్లునమిలిన నక్కా ఆనందబాబు..!
అంటే ప్రజలు ఏమీ తెలుసుకోకూడదని వీరు భావిస్తున్నారా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదో తప్పు చేస్తోంది.. ఏదో దాస్తోంది.. తన నిర్ణయాల పట్ల ప్రభుత్వం భయపడుతోంది.. అందుకే జీవోలను దాయాలనుకుంటోంది అన్న అభిప్రాయాన్ని అయితే ఈ నిర్ణయం ద్వారా నేరుగానే ప్రభుత్వమే ప్రజల్లోకి పంపినట్లు అయింది. సరే కొందరు ప్రభుత్వం జారీ చేసే జీవోలపై కోర్టుకెళ్తూ ఉండవచ్చు.. ప్రతి నిర్ణయానికి అడ్డుపడుతూ ఉండవచ్చు. అంత మాత్రాన దాన్ని మరో మార్గంలో ఎదుర్కోవాల్సింది పోయి.. మేము నిజంగానే నిజాయితీగా వున్నాము అని చెప్పాల్సింది పోయి.. అసలు జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచకుండా తీసేయాలి అంటే, ఇది తిరోగమన దశకు వెళ్లడం కాదా. ( ప్రభుత్వ పథకాలే ఏపీలో ఆర్థిక పరిస్థితికి కారణమా.. )
జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం కోర్టులో నిలబడుతుందా లేదా అన్న దానికి తాజాగా ఈ రోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణాలో కెసిఆర్ దళిత బంధు పథకం అమలు కోసం నిబంధనలను రూపొందించకుండానే నిధులు విడుదల చేశారు అంటూ ఒక స్వచ్ఛంద సంస్థ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. లేదు, దళిత బంధు అమలుకు నిబంధనలు తయారు చేశామని అడ్వకేట్ జనరల్ చెప్పగా.. పిటీషనర్ మాత్రం అసలు నిబంధనలు తయారు చేయలేదు.. ఆ జీవో కూడా వెబ్సైట్లో పెట్టలేదు అని తన వాదన వినిపించారు.
- మా బాబుగారు సింహంలా ఢిల్లీ వస్తే ఎవరూ పట్టించుకోరే.. !
- పాకిస్తాన్ లో తాలిబన్ జెండాలు.. ఉలిక్కిపడ్డ ఇమ్రాన్ ఖాన్
- పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ రాజీనామా..!
- చైనా గుప్పెట్లోకి శ్రీలంక దీవులు..భారత్ కు ముప్పు పొంచిఉందా ..?
- IT Rides on Sonu sood | సోనూసూద్ ఇంటిపై ఇన్కమ్ టాక్స్ దాడులు.. అందుకేనా.. !
ఈ సందర్భంగానే తెలంగాణ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు అన్నింటినీ ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిందే అని స్పష్టం చేసింది. 24 గంటల్లోగా ప్రతి జీవోను ఆన్లైన్లో పెట్టాల్సిందేనని కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కొందరికి చంద్రబాబునాయుడు మీద అభిమానం ఉండొచ్చు.. మరి కొందరికి జగన్మోహన్రెడ్డి మీద అభిమానం ఉండొచ్చు. ఏ ప్రభుత్వం అయినా సరే పారదర్శకత లేకుండా.. ప్రజలకు సమాచారం అందుబాటులో లేకుండా.. ప్రజలకు తెలియకుండా రహస్యంగా పనులు చేయాలి అని ఏ ప్రభుత్వము ప్రయత్నించినా దాన్ని ఖచ్చితంగా అడ్డుకోవాల్సిందే.
జగన్ మోహన్ రెడ్డికి సలహాలు ఎవరు ఇస్తున్నారు అన్నది పక్కన పెడితే.. కొందరు చదువుకున్నవాళ్ళు కూడా జీవోలను ఆన్లైన్లో లేకుండా చేయడం మంచిదే అన్నట్టు భావించడం కూడా ఇది ఒక దురదృష్టకరమైన పరిణామం గానే చెప్పాల్సి ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వం వారు కాన్ఫిడెన్సియల్ గా కొన్ని జీవోలను పెట్టినప్పుడే అందరూ దానిని వ్యతిరేకించారు.. ఇది తప్పుడు నిర్ణయం అని చెప్పారు. మరి ఇప్పుడు ఏకంగా Government Order Issue Register సైట్ లో జీవోలే లేకుండా దాన్ని నిర్వీర్యం చేయాలన్న ప్రయత్నాల్ని మనం ఏవిధంగా సమర్ధించుకుంటాము. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి హైకోర్టులో మాత్రం ఎదురుదెబ్బ తగలక తప్పదు.