వాక్సిన్ తో ఈసీ నిమ్మగడ్డకు చెక్ పెట్టిన జగన్.. !!

ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెబుతున్నట్లు ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి హైకోర్టు కు స్పష్టం చేసింది. ఈ మేరకు అదనపు అఫిడవిట్ ను ఏపీ ప్రభుత్వం ఈ రోజు హైకోర్టులో దాఖలు చేసింది.

అందులో ఫిబ్రవరి నెలలో కరోనా వ్యాక్సినేషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని తమ అదనపు అఫిడవిట్లో ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కరోనా వ్యాక్సినేషన్ సంబంధించి ఇప్పటికే కేంద్రం మార్గదర్శకాలు కూడా విడుదల చేసిందని, కాబట్టి ఆ సమయంలో ఎన్నికలు నిర్వహించలేమని పేర్కొంది.

కరోనా వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున చేయాల్సి ఉంటుందని, అన్ని శాఖలకు సంబంధించిన సిబ్బందిని, ఉద్యోగుల్ని వాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఎన్నికలు పెడితే పోలీసులను కానీ.. సిబ్బందిని గాని ఎన్నికల కోసం కేటాయించడం సాధ్యం కాదని తెలిపింది.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెబుతున్నట్టు ఫిబ్రవరి నెలలో పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఎన్నికల కంటే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా ముఖ్యమైనదని ప్రభుత్వం అభిప్రాయపడింది.

కరోనా వాక్సిన్ మొదటి డోస్ వేసిన తర్వాత తిరిగి నాలుగు వారాలకు రెండో డోస్ కూడా వేయాల్సి ఉంటుంది. దాదాపు ఇది రెండు నెలలు పట్టే ప్రక్రియ కాబట్టే ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు అని ప్రభుత్వం తన అఫిడవిట్ లో చెప్పింది.

ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అదనపు అఫిడవిట్ కు కౌంటర్ దాఖలు చేస్తామని ఎన్నికల కమిషన్ గడువు కోరింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా పడింది. వ్యాక్సినేషన్ సంగతి పక్కన పెడితే ఇప్పటికే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కూడా జనవరి 15 నుంచి మార్చి 15 మధ్య ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కూడా దాడి చేసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ఒక నివేదికను సిద్ధం చేసింది.

ఆ నివేదికను కూడా ఎన్నికల సంఘానికి పంపింది. ఏ విధంగా చూసుకున్నా నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చి 31కి రిటైర్ అవుతారు కాబట్టి ఆలోపు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు.. కనిపించడం లేదు. ప్రభుత్వ వైఖరి కూడా అదే విధంగా ఉంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మొదలైతే ఎన్నికలు అనేది మార్చిలోపు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు.

Leave a Comment