అక్రమార్కుల చేతిలో విశాఖ భూములు ..స్వాధీనం చేసుకుంటున్న అధికారులు..!!

విశాఖలో మరో భూ మాయను ప్రభుత్వం బద్దలు చేసింది. ప్రభుత్వానికి చెందిన 70 ఎకరాలను కొందరు పెద్దలు ఆక్రమించారు. ఏళ్ళ తరబడి ఆ భూమిని చేరబట్టారు. ఏకంగా కంచె వేసి ఫామౌస్ తరహా నిర్మాణాలు చేశారు. ఈ భూమి విలువ దాదాపు 300 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

శనివారం ఉదయమే రెవెన్యూ అధికారులు వెళ్లి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసిన గోడలను కూల్చివేశారు. అనంతరం ఇది ప్రభుత్వ భూమి అని పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. విశాఖ సమీపంలోని విజయరాం అగ్రహారంలో భూమిని బడాబాబులు ఆక్రమించేశారు.

ఇందులో టీడీపీ మాజీ మంత్రికి చెందిన అనుచరుల ఆధీనంలోనే ఎక్కువ భూమి ఉన్నట్లు గుర్తించారు. ఇప్పుడు దానిని స్వాధీనం చేసుకున్నారు. గత ప్రభుత్వంలోనే ఆక్రమించుకొని, పెన్సింగ్ వేసి, చెట్లు నాటి, నిర్మాణాలు కూడా చేపట్టారు. విశాఖలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను గుర్తిస్తున్న అధికారులు.. ఉన్నతాధికారుల నుంచి అనుమతులు తీసుకుని శనివారం ఉదయం వెళ్లి భూమిని స్వాధీనం చేసుకున్నారు.

అనంతపురంలో ఒక ప్రముఖ విద్యాసంస్థ కూడా రెండు ఎకరాల వరకూ భూమిని ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. దాన్ని కూడా శనివారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నగరంతోపాటు చుట్టుపక్కల ఇంకా వందలాది ఎకరాల భూములు కబ్జాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిని కూడా త్వరలోనే అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

Leave a Comment