ఆనందయ్య ఆయుర్వేదం : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా కబంధహస్తాల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. రెండో దశ విజృంభణతో భారత్లో పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. కొంతవరకు కేసుల్లో తగ్గుదల ఊరటనిస్తున్నా.. ఇంకా మరణాల సంఖ్య తగ్గటం లేదు.
ప్రపంచంలోని రెండో అత్యధిక జనాభా కలిగిన భారత్లో ఆగమేఘాలమీద వ్యాక్సినేషన్ పూర్తిచేసి మహమ్మారికి అడ్డుకట్ట వేయడం అంత సులువైన విషయమేమీ కాదు. మరి అప్పటి వరకు మహమ్మారి విస్తృతిని అడ్డుకోవడం ఎలా..? దీనికి ఏకైక పరిష్కారం కరోనా మెడిసిన్ తయారు చేయడమే.
ఇప్పటి వరకు వాక్సిన్ అయితే అందుబాటులోకి వచ్చాయి గానీ కరోనా మందు పై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల DRDO తీసుకొచ్చిన 2DG మందు ఆశలు కల్పిస్తున్న.. ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో భారతీయ సంప్రదాయ వైద్య విధానం నేనున్నానంటూ అభయ హస్తం అందిస్తోంది. ( DRDO రూపకల్పనలో మరో కొత్త డ్రగ్ .. ! 2-Deoxy-D-glucose )
కృష్ణపట్నం కి చెందిన ఆనందయ్య కరోనా మందు ఆశలు కల్పిస్తోంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కి చెందిన బొనిగెల ఆనందయ్య అనే ఆయుర్వేద నిపుణులు అందిస్తున్న కరోనా మందుపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. అతను తయారు చేసిన మందు ప్రభావం ఎలా ఉందంటే.. కరోనా తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నా ఆనందయ్య మందు వాడితే ఒక్కరోజులోనే నయమైపోతుందట. కేవలం రెండు రోజుల్లోనే నెగటివ్ రిపోర్ట్
కూడా వస్తోందట. ఇది ఆ మందులు వాడిన వారు చెబుతున్న మాట.
కార్పొరేట్ ఆసుపత్రుల ట్రీట్మెంట్ కి తగ్గని కరోనా సైతం ఆనందయ్య ఆయుర్వేద మందుతో కోలుకుంటున్నారని అక్కడి మందు వాడిన భాదితులు చెబుతున్నారు. ఊపిరాడకుండా ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ఎంతో మంది కరోనా బాధితులు సైతం కోలుకున్నట్టు వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఈ మందు విషయంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా జనం తండోప తండాలుగా తరలి వస్తున్నారు.
ఆనందయ్య ఆయుర్వేదం అధ్యయనం కూడా అవసరమే
మందులో వాడే పదార్థాలు కూడా మనందరికీ తెలిసినవే. పటికబెల్లం, పచ్చకర్పూరం, మిరియాలు, ధనియాలు, పసుపు, తేనె వంటివి మరికొన్ని పదార్థాలు కలిపి చేస్తున్నా ఈ ఆయుర్వేద మందు.. చైనా వైరస్ కు సమూలంగా చంపేసినట్లు కొంతమంది చెబుతున్న పరిస్థితి. అయితే మందు ఎంత ప్రభావితమైనది అయినా దాన్ని ప్రభుత్వాలు గుర్తించాలంటే శాస్త్రీయ పరిశోధన అవసరం. ఆ మందుపై శాస్త్రీయ పద్ధతిలో అధ్యయనం జరగాలి. అప్పుడే దానికి గుర్తింపు లభిస్తుంది. ఆనందయ్య ఆయుర్వేద మందుకు కూడా ఇవే సమస్యలు ఎదురవుతున్నాయి.
మనదేశంలో లక్షలు పోసైనా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటారు తప్ప సంప్రదాయ ఆయుర్వేద వైద్యాన్ని మాత్రం అంత త్వరగా నమ్మరు. ఈ విషయంలో ప్రజలే కాదు, ప్రభుత్వాలు కూడా అంతే. ఆనందయ్య కరోనా మందు సత్తా ఏంటో తేల్చేందుకు ఇప్పుడు కేంద్రం నుండి ఐసీఎంఆర్, ఆయుష్ మంత్రుత్వ శాఖలు రంగంలోకి దిగాయి. ఆయుర్వేద మందు పై అధ్యయనం ప్రారంభించాయి. ఈ అధ్యయనం పూర్తయి ఆ మందుకు అనుమతులు ఇస్తే మంచిదే. కరోనా మహమ్మారి నుంచి దేశమే కాదు ప్రపంచం మొత్తం బయట పడుతుంది. మరి ఈ సంస్థల నుండి అనుమతులు వస్తాయా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
అడ్డుపడుతున్నది ఎవరు ..?
నిజానికి కరోనా వ్యాక్సిన్ లు అందుబాటులోకి రాకముందే మన దేశంలో కరోనాకు ఆయుర్వేదం, సిద్ధ వైద్యం అందుబాటులోకి వచ్చాయి. ఎంతోమంది అనధికారికంగా ఈ వైద్య విధానాల నుంచి ఉపశమనం పొందుతూవున్నారు కూడా. కానీ ఇలాంటి సమాచారం బయటకు రావడం లేదు అంతే. దీనికి కారణం ఎప్పటి లాగే మోడ్రన్ మెడిసిన్ నియమ నిబంధనలు సంప్రదాయ మందులను ముందుకు రానివ్వడం లేదు.
మోడ్రన్ మెడిసిన్ చదువుకున్న కొందరు నిపుణులు భారతీయ సంప్రదాయ ఔషధాన్ని పక్కన పెట్టేసారు. ఎంతో మంది ఆయుర్వేద నిపుణులు వారు కనిపెట్టిన ఆయుర్వేద మందు అనుమతులకోసం ఈ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. అయినా ఫలితం శూన్యం. భారతీయ సంప్రదాయ వైద్యాన్ని ప్రోత్సహించేందుకు మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది కాని ఆ శాఖ అధికారులు సైతం పాశ్చాత్య వైద్య శాస్త్రాన్ని అనుసరించే వారే కావడం వలన వారి నియమనిబంధనల ముందు ఆయుర్వేదం నిలదొక్కుకోలేకపోతోంది.
నేడు ఆనందయ్య అందిస్తున్న కరోనా ముందు సైతం ఆయుర్వేద మూలాల నుంచి పుట్టిందే. కరోనా మహమ్మారి ప్రాణాలతో చెలగాటమాడుతున్న తరుణంలో ఆనందయ్య కరోనా మందు ఒక సంజీవనిలా కనిపిస్తోంది ప్రజలకు. అయితే ఈ మహత్తర ఔషధానికి ఎప్పట్లాగే మోడ్రెన్ సైన్స్ అడ్డుపడుతోంది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …