Amrullah Saleh | ఆఫ్ఘనిస్తాన్ తెరపైకి అమ్రుల్లా సలేహ్

Amrullah Saleh as President : ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చించుకుంటున్న అంశం ఆఫ్ఘనిస్తాన్. ముఖ్యంగా ఆసియా ఖండంలో వున్నా అన్ని దేశాలు ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఎందుకని ఆఫ్ఘనిస్తాన్ లో మారుతున్న పరిణామాలు అన్ని దేశాల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే కేవలం ఐదంటే ఐదు రోజులలో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను హస్తగతం చేసుకున్నారు. అయితే ఈ పరిణామాలు ఎవరూ ఊహించలేదు. ఇంత త్వరగా తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ని తమ వశం చేసుకుంటారని ఎవరూ అనుకోలేదు. కారణం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ హెలికాప్టర్ నిండా డబ్బు సంచులతో ఖతార్ పారిపోయాడు అని చెబుతున్నారు.

ఇలా అష్రఫ్ ఘనీ పారిపోవడంతోనే ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడం చాలా తేలిక అయిందని అని చెబుతున్నారు. కానీ ఇప్పడు తాలిబన్లు చెబుతున్నదేంటంటే.. మేము ఎవరి మీద కక్ష సాధింపులు చెయ్యము, ఎవరి పని వారు చేసుకుంటూ ఉండవచ్చు.. క్షమాభిక్ష ప్రసాదిస్తున్నామని సహజత్వానికి భిన్నంగా ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్లు కూడా ప్రకటన చేశారు. ( తాలిబన్ల అధీనంలోకి ఆఫ్ఘనిస్థాన్ )

ఆఫ్ఘనిస్తాన్ తెరపైకి Amrullah Saleh

ఈ నేపథ్యంలో ఇవాళ ఒక చిన్న ట్విస్ట్ తెరమీదకు వచ్చిందనే చెప్పాలి. ఆఫ్ఘనిస్తాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు లేకపోయినా.. చనిపోయినా.. లేకపోతే రాజీనామా చేసినా.. ఆపద్ధర్మంగా ఉపాధ్యక్షుడు అధ్యక్షుడిగా మారతాడని అక్కడి రాజ్యాంగంలో రాసివుంది. ఈ మేరకు అక్కడ ఉపాధ్యక్షుడిగా ఉన్న అమ్రుల్లా సలేహ్ ( Amrullah Saleh ) ఇప్పుడు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుంటున్నా అని ప్రకటించడం అనేది కొత్త ట్విస్ట్ అని చెప్పాలి.

ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబన్ల వశం అయిపోయింది.. ప్రపంచ దేశాలు కూడా తాలిబన్లతో చర్చలు జరపడానికి సిద్దపడుతున్నారని చెప్తున్నారు. మరోవైపు రష్యా కూడా తాలిబన్లతో చర్చలు జరుపుతావున్నారు. పాకిస్థాన్ ఆల్రెడీ తాలిబన్లకు మద్దతుగా నిలిచింది. భారతదేశం కూడా తాలిబన్లతో చర్చలు జరపాలి అని అనుకుంటున్న పరిస్థితుల్లో.. ఇప్పుడు కొత్తగా అమ్రుల్లా సలేహ్ ( Amrullah Saleh ) అధ్యక్షుడిగా ఉంటానని ట్విట్టర్ ద్వారా చెప్పడం ట్విస్టుగా మారింది.

దీంతో సైనికుల్లో ఒక రకమైన ఉత్సాహం వచ్చింది అని అంటున్నారు. వెంటనే ఆర్మీ చారికర్ అనే ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదేసమయంలో పంజ్ షేర్ ప్రాంతాల్లో తాలిబన్ల మీద కూడా ఆర్మీ దాడులు చేస్తోంది. ఒక రకంగా చూస్తుంటే ఆర్మీ మళ్లీ ఉత్సాహంతో తాలిబన్లు ఆక్రమించిన ప్రాంతాలను కూడా విడిపించేందుకు ప్రయత్నం చేస్తోంది.

మరోవైపు అమ్రుల్లా సలేహ్ మాత్రం అంతర్జాతీయంగా సహాయం కోరుతున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ కూడా తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూనే, అంతర్జాతీయంగా కూడా సహాయం ఆర్జిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయంగా సహాయం తాలిబాన్లకు దక్కుతుందా.. లేకపోతే అమ్రుల్లా సలేహ్ కు అందుతుందా అనేది చూడాలి. ఒక వైపు ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడమే కాదు.. చాల విలువైన లిథియం ఖనిజ సంపద మరియు ఇతర ఖనిజ సంపదలను దోచుకునే ప్రయత్నంలో తాలిబన్లు వున్నారు. ఇదంతా చూస్తున్న ప్రపంచ దేశాలు తాలిబాన్లకు మద్దతు ఇస్తారా లేకపోతే అమ్రుల్లా సలేహ్ కు మద్దతు ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది.

More Latest telugu news todayOnline telugu news todayPolitical newsonline news today

2 thoughts on “Amrullah Saleh | ఆఫ్ఘనిస్తాన్ తెరపైకి అమ్రుల్లా సలేహ్”

Leave a Comment