జగన్ కు మోడీ , అమిత్ షా ఫోన్.. క్యాబినెట్ లోకి ఆహ్వానం

మరో రెండు రోజుల్లో మోడీ తన క్యాబినెట్ విస్తరణకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే మోడీ దేశానికి ప్రధానిగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. ప్రధానిగా ఎవరూ ఊహించనంత మెజారిటీతో విజయం సాధించారు. తాను రెండోసారి ప్రధాని అయ్యాక రెండో క్యాబినెట్ విస్తరణ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు మోదీ.

ఈ కేబినెట్ విస్తరణలో ప్రస్తుతం ఉన్న మంత్రులు కొంతమందిని తొలగించి వారి స్థానంలో కొత్త వారికి చోటు కల్పించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా కేంద్ర మంత్రులుగా వున్నా వారికి గవర్నర్ గా బాధ్యతలు అప్పగించారు. ఏపీ నుంచి మాజీ మంత్రి కంభంపాటి హరిబాబును మిజోరాం గవర్నర్ గా .. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గ వున్నా బండారు దత్తాత్రేయను హర్యానాకు బదిలీ చేశారు. ( మోదీ సర్కార్ టార్గెట్ గా )

ఈసారి యువకులకు.. కొత్త పార్టీలకు

అయితే ఈ క్యాబినెట్ లోకి కొత్త పార్టీలను కూడా చేర్చుకునే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్రలో అధికారంలో వున్న శివసేన పార్టీ ఎన్డిఏలో చేరుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఏపీ విషయానికొస్తే అధికారంలో ఉన్న వైసీపీ కూడా కేంద్ర ప్రభుత్వంలో చేరుతుందని గత కొద్దీ కాలంగా ప్రచారం జరిగింది. అవి ఒట్టి పుకార్లే అని తేలి పోయాయి.

తాజాగా మోదీ క్యాబినెట్ విస్తరణ జరుగుతున్నా నేపథ్యంలో మరోసారి వైసీపీ ఎన్డిఏలో చేరుతున్నారని ప్రచారం ఊపందుకుంది. దానికి అనుగుణంగానే వైసిపిని మరోసారి కేంద్రంలోకి ఆహ్వానించినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
గత సార్వత్రిక ఎన్నికల్లో దేశం మొత్తం మోడీ హవా కనిపిస్తే .. ఏపీలో మాత్రం జగన్ ప్రభంజనం కనిపించింది. ( Cabinet List )

అతిపెద్ద పార్టీగా వైసీపీ

ఏపీలో జగన్ నేతృత్వంలోని వైసీపీ పార్టీ అత్యధిక అసెంబ్లీ సీట్లతో పాటు అత్యధికంగా లోక్ సభ స్థానాలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. వైసీపీ తన ఘన విజయంతో లోక్సభలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఎన్టీఆర్ తర్వాత లోక్సభలో అతిపెద్ద తెలుగు పార్టీగా వైసిపిని నిలిపారు జగన్. దీంతో జగన్ పార్టీని పలుమార్లు ఎన్డీయేలోకి ఆహ్వానించారు మోడీ. పలుమార్లు అమిత్ షా కూడా ఎన్డీయేలో చేరాలని జగన్ ని కోరారు. కానీ జగన్ వారి విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది.

ప్రత్యేక హోదాకు ఇస్తేనే

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఎటువంటి భేషజాలు లేకుండా ఎన్డిఏలో చేరుతామని తెలిపినట్టుగా మీడియాలో కధనాలు వచ్చాయి. తాజాగా మోదీ క్యాబినెట్ విస్తరణ చేయనుండటంతో తటస్థ పార్టీలకు చివరి అవకాశంగా ఫోన్ చేస్తున్నారని తెలుస్తోంది. దీనిలో భాగంగానే వైసిపి అధినేత వైయస్ జగన్ కు చివరి ఫోన్ కాల్ హోంమంత్రి అమిత్ షా చేసినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ అవకాశం వదులుకుంటే వచ్చే ఎన్నికలనాటికి మీరు మిత్రపక్షంగా వున్నా కూడా కేంద్ర కాబినెట్ లోకి చేరే అవకాశం ఉండకపోవచ్చని అమిత్ షా చెప్పినట్టు తెలుస్తోంది. అయినా కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ ఇస్తే బేషరతుగా మద్దతు ఉంటుందని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేసినట్లుగా జాతీయ మీడియా తెలిపింది. ప్రత్యేక హోదాకు సంభందించి వైసీపీ తన మాటకు కట్టుబడి ఉందని జాతీయ మీడియా తన కధనంలో పేర్కొంది.

Leave a Comment