కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇటీవల కరోనా బారినపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఇటీవలే ఆయనకు కరోనా తగ్గి ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.
కరోనా నెగెటివ్ వచ్చినా ఆయన హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. ఇంటినుంచే తన కార్యకలాపాలను సాగిస్తున్నారు. అయితే, ఉన్నట్టుండి ఆయన మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఎయిమ్స్‌కు ఆస్పత్రికి తరలించారు.
అమిత్‌షా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని ప్రచారం సాగుతోంది. ఎయిమ్స్ ప్రత్యేక వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. కాగా అమిత్ షా ఎయిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ కావడంతో ఆయన ఆరోగ్యానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు ఆరా తీశారు. ఇటీవలే ఆయన కరోనా నుంచి కోలుకొని ఇంటికి వచ్చిన కొన్ని రోజుల్లోనే మళ్లీ ఆయన అనారోగ్యానికి గురికావడంతో కేంద్రంతో పాటు బీజేపీ నాయకులు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
కరోనా లక్షణాల్లో ప్రధానమైనదిగా భావించే శ్వాసకోస సమస్య అమిత్‌షాకు ఎదురు కావడంతో ఆయనకు కరోనా పూర్తిగా తగ్గలేదా.. లేక మరో సమస్య ఏమైనా ఎదురైందా అని అందరూ చర్చించుకుంటున్నారు. ఆయనను డాక్టర్లు పూర్తిగా పరీక్షించిన తర్వాతే అనారోగ్యానికి కారణాలు తెలిసే అవకాశముంది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్‌కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …