నిన్న రాత్రి కేరళలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది.
ఇందులో 18 మంది ప్రయాణికులు మరియు ఇద్దరు పైలెట్లు ఉన్నారు.
మొత్తం 191 మంది ప్రయాణికులు వున్న ఈ ఎయిర్ ఇండియా విమానం శుక్రవారం రాత్రి 7.40 గంటలకు దుబాయ్ నుంచి కేరళలోని కోళీకోడ్ ఎయిర్ పోర్ట్ లో దిగుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది.
వర్షం భారీగా పడుతుండటంతో రన్వే నుంచి పక్కనే వున్న 50అడుగుల లోయలో పడిపోయింది.వందేభారత్ మిషన్ లో భాగంగా ఈ ఎయిర్ ఇండియా విమానం దుబాయ్ నుండి కేరళకు బయలుదేరింది.
ఈ ప్రమాదం లో మృతులతో పాటు పలువురు ప్రయాణికులు గాయపడినట్టు తెలుస్తుంది. బాదితులను దగ్గర్లో వున్న హాస్పిటల్ కి పంపి వైద్య చికిత్స చేయిస్తున్నారు.
సహాయక కార్యక్రమాలను మంత్రి మొయిద్దీన్ పర్యవేక్షిస్తున్నారు. ఎన్డిఆర్ఎఫ్ బృందాలను ప్రమాద స్థలానికి పంపారు.
భారీ వర్షం కారణంగా విమానం సరిగ్గా ల్యాండింగ్ అవలేదని ప్రాథమిక సమాచారం అందినట్టు డిజిసీఏ డైరెక్టర్ అరుణ్ కుమార్ తెలిపారు.
ప్రమాద ఘటనపై రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరియు ప్రధాని మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.
కేంద్రం నుండి కావాల్సిన సహాయం అందిస్తామని కేరళ ముఖ్యమంత్రి విజయన్ కు మోదీ హామీ ఇచ్చారు.
ఈ ప్రమాదం పట్ల తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులతో సహా మిగతా రాష్ట్ర సీఎంలు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలు
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదిక
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలు
Good information