టీపీసీసీ చీఫ్ గా ఎంపీ రేవంత్ రెడ్డి

తెలంగాణ పిసిసి పదవిపై గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అసలు అధిష్టానం టీపీసీసీ పదవిని నియమిస్తుందా లేదా అనే సందేహాలు కూడా కొందరు నాయకుల్లో వచ్చాయి. అటు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ అధ్యక్ష పదవి నాకంటే నాకు అని పోటీ పడుతూ వచ్చారు. రెడ్డికి ఇవ్వాలని కొందరు అంటుంటే.. కాదు కాదు బీసీలకే కరెక్ట్ అంటూ మరికొందరు నాయకులు అధిష్టానం ముందు తమ తమ డిమాండ్లను వినిపించారు.

అయితే మొత్తానికి ఈ టీపీసీసీ పదవి ఎంపికకు కాంగ్రెస్ అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది. ఫైనల్ గా ఎంపీ రేవంత్ రెడ్డికే టీపీసీసీ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వడానికి అధిష్టానం మొగ్గుచూపింది. ఈ ప్లేస్ లో ఉన్న నేతలందరితో పార్టీ ఇన్చార్జి మాట్లాడారు. అధినేత తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎంపీ రేవంత్ రెడ్డికి పిసిసి ఇచ్చారని, మీరంతా కలిసికట్టుగా పనిచేస్తే భవిష్యత్తులో పార్టీ ప్రభుత్వం వచ్చాక ప్రాధాన్యత ఉంటుందని అధిష్టానం చెప్పినట్లు తెలుస్తోంది.

పీసీసీ రేసులో అనేక పేర్లు తెరపైకి వచ్చినా చివరకు ఎంపీ రేవంత్ రెడ్డికి పదవి దక్కడం జరిగింది. కాంగ్రెస్ కోర్ గ్రూప్ అంతా రేవంత్ రెడ్డి వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కెసిఆర్ పై రాజీ లేని పోరాటం చేస్తున్నారన్న గుర్తింపుతో పాటు.. పార్టీ కేడర్లో ఉన్న క్రేజ్ తోనే రేవంత్ రెడ్డికి ఈ పదవి దక్కిందని సమాచారం. అలాగే టి వర్కింగ్ ప్రెసిడెంట్లు గా అజారుద్దీన్, గీతా రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి , మహేష్ కుమార్ గౌడ్ లను నియమించారు.

Leave a Comment